ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏ మంత్రికి లేని కష్టాలు ఆయనకు వచ్చిపడ్డాయి. సొంత పార్టీ నేతల వద్ద ఆయన వాపోయినట్టు తెలిసింది.
తాజాగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తన సొంత పార్టీ నేతల వద్ద రాజకీయాల నుంచి తప్పుకోమంటారా ఏంటి అంటూ లబోదిబోమన్నారట.. తనపై వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నా అని ఆవేదన చెందారట.. అసలు డిప్యూటీ సీఎం ఎందుకిలా వాపోయాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
చిత్తూరు జిల్లాలో గ్రూపు రాజకీయాలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కొద్దికాలంగా ఆందోళనగా ఉన్నారు. గ్రామాల నుంచి కొందరినీ తరిమివేయాలంటే ఎలా అని నేతలను ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రతిపక్ష పార్టీల నేతల విషయంలో అధికార పార్టీ నేతల ఒత్తిడిని నారాయణ స్వామి ఖండించినట్టు తెలిసింది.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని కొన్ని గ్రామాలలో ఏటా ఆనవాయితీగా జల్లికట్టు నిర్వహించేవారు. అయితే ఈసారి జల్లికట్టు నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో మంత్రి ముందు వైసీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే కష్టమే అంటూ మంత్రి ముందు గట్టిగా మాట్లాడారు.
దీంతో సొంత పార్టీ నేతలతో మాట్లాడిన నారాయణ స్వామి తాను అందరిలా రాజకీయాలు చేయడం లేదని.. పద్ధతులను పాటిస్తున్నానని వాపోయారట.. ప్రతిపక్షాల వారిపై కక్షసాధింపు చర్యలు తీసుకోవాలంటూ తనపై వస్తున్న ఒత్తిడిపై కూడా ప్రస్తావించిన ఆయన గ్రామం నుంచి కొందర్ని తరిమేయాలంటూ ప్రశ్నించారు. జల్లికట్టు పైన కూడా తానేమీ చేయలేకపోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.