వైసీపీ సర్కార్ ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తున్నట్లుగా చెప్పుకుంటోంది. అయితే కొన్ని ముఖ్యమైన హామీలు మాత్రం అలాగే ఉండిపోయాయి. అందులో సీపీఎస్ రద్దు ఒక కీలకమైనది. జగన్ పాదయాత్ర వేళ ఉద్యోగ వర్గాలకు ఈ భారీ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేసి తీరుతామని అన్నారు. ఇపుడు చూస్తే జగన్ పాలనలో మూడేళ్ళు ఇట్టే గడచిపోయాయి. కానీ సీపీఎస్ రద్దు ఊసే లేదు.
దీని మీద ఉద్యోగ సంఘాలు చాలా గుస్సా మీద ఉన్నాయి. సీపీఎస్ రద్దు చేయకపోతే గద్దె దిగాల్సిందే అంటున్నారు. తాజాగా తిరుపతిలో ఏపీటీఎఫ్ నాయకులు దీని మీదనే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. తాము ఈ విషయాన్ని ఏ కోశానా వదిలేయమని కూడా స్పష్టం చేశారు. దేశంలో రాజస్థాన్, చత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో సీపీఎస్ ని రద్దు చేశారని గుర్తు చేశారు.
ఆ బాటలో ఏపీ కూడా నడవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సీపీఎస్ రద్దు అంటే తలకు మించిన భారం. దాంతో అధికారంలోకి వచ్చాక సీపీఎస్ రద్దు గురించి అర్ధం చేసుకున్నామని, నాడు తెలియక హామీ ఇచ్చామని వైసీపీ నేతలు అంటున్నారు. అందువల్ల రద్దు వద్దే వద్దు అన్నది ప్రభుత్వ విధానంగా ఉంది.
ఇక దీని మీద ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అయితే ప్రభుత్వ సీపీఎస్ రద్దు మీద కసరత్తు చేస్తోంది అని చెప్పుకున్నారు. అయితే ఉద్యోగులు అంతా పాత పెన్షన్ విధానమే తమకు అమలు కావాలని కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం మధ్యేమార్గాన్ని ఎంచుకుంటోంది అని అంటున్నారు. సీపీఎస్ రద్దు కాకుండా ఉద్యోగులకు ఎంతో కొంత ఆర్ధిక భరోసా ఇచ్చేలా ఈ వ్యవహారాన్ని ముగించాలని చూస్తోంది.
దీని మీద ఈ నెల 4 నుంచి ప్రభుత్వ ఆర్ధిక శాఖతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్టాండ్ ఏంటి అన్నది తెలుస్తుంది. అయితే సీపీఎస్ రద్దు అన్న ఒకే ఒక డిమాండ్ తోనే ఈ చర్చలలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని డిసైడ్ అయ్యారు.
మరి అదే కనుక జరిగితే మాత్రం సీపీఎస్ రద్దు అన్నది వైసీపీ సర్కార్ కి గుదిబండగానే మారుతుంది. దాన్ని తేల్చలేరు. అలాగని ముంచలేరు. మొత్తానికి ఉద్యోగులతో ఇప్పటికే పీయార్సీ విషయంలో కొంత గ్యాప్ అయితే వైసీపీకి వచ్చింది. ఇపుడు సీపీఎస్ రద్దు విషయం కనుక వారు కోరుకున్నట్లుగా సెటిల్ కాకపోతే వచ్చే ఎన్నికలో అది తీవ్ర ప్రభావం రాజకీయంగా చూపిస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి.