ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు.. ఉపాధ్యాయులు రోడ్డెక్కేందుకు రెడీ అయ్యారు. కంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని(సీపీఎస్) రద్దు చేస్తానని.. అధికారంలోకి వచ్చిన వారంలోనే దీనిని పక్కన పెట్టి.. ఉద్యోగుల కళ్లలో ఆనందం నింపుతానని..గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేతగా జగన్ హామీ ఇచ్చారు. అయితే.. ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయినా.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనినే.. ఇప్పుడు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తమకు సీపీఎస్ వద్దు.. ఓల్డ్ పింఛన్ స్కీం(ఓపీఎస్) ముద్దు.. అని డిమాండ్ చేస్తున్నారు.
అయితే.. ఏపీ సర్కారు మాత్రం `ఇది తక్క..` అని హఠం చేస్తోంది. కానీ, ఉద్యోగులు మాత్రం ``ఇదే..ఇదే..`` పట్టుబడుతున్నారు. దీంతో సర్కారుకు-ఉద్యోగులకు మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇక, మరోవైపు ఉద్యోగులను తన దారిలో తెచ్చుకునేందుకు వైసీపీ ప్రభుత్వం మంత్రులతోకూడిన కమిటీని వేసి.. చర్చలకు పిలుస్తోంది. ఉద్యోగులు కూడా చర్చలకు వెళ్తున్నారు. అక్కడా ఇదే పాట. ``మేం ఇవ్వం`` అని సర్కారు అంటుంటే.. ``ఇవ్వాల్సిందే!`` అని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. దీంతో ఇప్పుడు ఇది ఉద్యమస్థాయికి చేరింది. సెప్టెంబరు 1న సీఎం ఇంటి ముట్టడి.. మిలియన్ మార్చ్‌కు సంఘాలు పిలుపునిచ్చాయి.
అయితే.. సర్కారు దూకుడు పెంచింది. ఎక్కడికక్కడ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతోంది. వారు విజయవాడకు రాకుండా.. సీఎం ఇంటి ముట్టడిలో పాల్గొనకుండా.. మిలియన్‌మార్చ్‌కు హాజరు కాకుండా.. వ్యూహాత్మకంగా వారిపై కేసులు పెడుతోంది. బైండోవర్లు చేస్తోంది. అంతేకాదు.. ఉద్యోగులు ఎక్కడ వస్తారో.. అని వారి మోపెడ్లు, కార్లు, బైకులు.. ఇలా అన్ని సొంత వాహనాలను పోలీసులు ఎత్తుకెళ్లి స్టేషన్లలో పెడుతున్నారు. ఇదేమీ ఒక జిల్లాకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా.. అన్ని జిల్లాల్లోనూ.. కనిపిస్తోంది. దీంతో ఉద్యోగులు ఇప్పుడు సర్కారు దూకుడు ముందు చివురుటాకులు అయిపోయారనే వాదన వినిపిస్తోంది.
కట్ చేస్తే.. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఉద్యోగులకు అండగా నిలవకపోవడం.. చర్చకు వస్తున్న ప్రధాన విషయం. రాష్ట్రం ఎక్కడ ప్రభుత్వంపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా.. ఏవర్గం తిరుగుబాటు చేసినా వెంటనే ఈ పార్టీలు వాలిపోతున్నాయి. తమ వాయిస్ కూడా వినిపిస్తున్నాయి. బాధితుల పక్షాన అండగా ఉంటామని చెబుతున్నాయి. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాంటి పార్టీలు ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. వారు చేస్తున్న ఉద్యమాలకు అండగా ఉంటామని.. కానీ, ప్రభుత్వ దూకుడు తప్పని కానీ.. చెప్పడం లేదు.
దీంతో ఎందుకు ఆయా పార్టీలు ఇలా వ్యవహరిస్తున్నాయనేది ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఉద్యోగుల పక్షాన ఎవరూ ముందుకు రాకపోవడంతో సర్కారు దూకుడు మరింత పెరిగింది. ఉద్యోగులను ఏం చేసినా.. ఎవరూ మాట్లాడరు అనే ధోరణి కనిపిస్తోందని.. పరిశీలకులు చెబుతున్నారు. ఇక, పార్టీల విషయానికి వస్తే.. సీపీఎస్ విషయం గుదిబండ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిని రద్దు చేసే అవకాశం లేదని.. గమనించే ఆయా పార్టీలు ఏవీ కూడా ఉద్యోగుల పక్షాన నోరు పెగల్చలేక పోతున్నాయని అంటున్నారు. సో.. మొత్తానికి ఇప్పుడు ఉద్యోగులు వర్సెస్.. వైసీపీ సర్కారుకు మధ్య పోరు ఎటు దారి తీస్తుందో చూడాలి. కానీ, వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులు ఏ పార్టీకి ఓటేయాలి? అనేది కూడా ఆసక్తిగా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.