ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్.. ప్రకటించిన హామీల్లో అత్యంత కీలకమైంది.. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు అత్యంత ఆగ్రహంతో ఉన్నాయి. ఫిట్‌మెంటును 45 శాతం తగ్గించొద్దని వారు ఆది నుంచి పోరాటం చేస్తున్నారు. అయితే.. అసలుపీఆర్సీ నే 14.6 శాతం కన్నా మించొద్దని చెప్పిన సీఎం జగన్.. తమ ప్రబుత్వం ఎంతో ఉదారంగా ఉందని.. ప్రభుత్వానికి సేవ చేస్తున్న ఉద్యోగులకు ఎంత ఇచ్చినా తక్కువేనని యథాలాపంగా గతంలో చెప్పిందే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన దీనిని 9 శాతం పెంచి 23.39 శాతం పెంచారు. నిజానికి దీనిని ఉద్యోగులు ఏమేరకు స్వీకరిస్తారనేది చూడాలి.
ఇక, సీఎం జగన్ హామీల్లో ఉద్యోగుల విరమణ వయసు కీలకం. ప్రస్తుతానికి ఇది ఉద్యోగులకు ఎంతో ఊరట నిచ్చే అంశమే. వాస్తవానికి విభజన తర్వాత.. చంద్రబాబు హయాంలో వారి ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి రెండేళ్లు పెంచుతూ.. ఉత్తర్వులుఇచ్చారు. దీంతో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెరిగింది. అయితే.. దీనిపై అప్పట్లోనే నిరుద్యోగ సంఘాలు.. కోర్టుకు వెళ్లాయి. కానీ, అప్పట్లో ఇంక పెంచొద్దని పేర్కొంటూ.. హైకోర్టు తీర్పు చెప్పింది. అంటే.. 60 ఏళ్లకు పెంచడానికి వీల్లేదని.. హైకోర్టు స్పష్టంగా చెప్పిందనే అనుకోవాలి. కానీ, ఇప్పుడు జగన్ మరో రెండేళ్లు పెంచుతూ.. తన పై ఉద్యోగుల్లో ఉన్న ఆగ్రహాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశారు.
కానీ, ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయాలు ఎక్కడా నిలబడినట్టు కనిపించడం లేదు. గతంలో కేరళ, కర్ణాటకల్లోనూ.. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడిహైకోర్టు లు తీవ్రంగా స్పందించారు. 58 ఏళ్లకు మించడానికి వీల్లేదని.. కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు.. నిరుద్యోగులకు దక్కాల్సిన అవకాశాలను ప్రభుత్వం అణిచి వేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుందని తీర్పు చెప్పింది. కర్ణాటకలోనూ 1 సంవత్సరం పెంచుతూ.. యడియూరప్ప సర్కారు(తొలి ప్రభుత్వం 2009-10) గతంలో తీసుకున్న నిర్ణయాలను కూడా అక్కడి హైకోర్టు తోసిపుచ్చింది.
ఇప్పుడు ఇక్కడ ఏకంగా 58 కి మించి నాలుగు సంవత్సరాలు పెంచారు. ఇది వివాదం అవుతుందని.. నిరుద్యోగులు.. కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని పరిశీలకులుచెబుతున్నారు. అంటే.. కేవలం ఉద్యోగులను శాంత పరిచేందుకు తీసుకున్న నిర్ణయమే తప్ప.. న్యాయపరంగా చెల్లుబాటు కాదని.. పేర్కొంటున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా కేరళ ఇష్యూ కోర్టుకు వచ్చినప్పుడు పదవీ విరమణ వయసును పెంచడానికి తాము ఒప్పుకోబోమని.. పపేర్కొన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.