రాజధాని నిర్ణయాధికారంపై ఏపీ సర్కార్ సంచలనం

Update: 2020-08-13 15:30 GMT
ఏపీ రాజధాని సమస్యపై అలుపెరగకుండా ఫైట్ నడుస్తోంది. గవర్నర్ ఆమోదించినా ఇది న్యాయసమీక్షకు వెళ్లింది. ప్రస్తుతం హైకోర్టులో దీనిమీదే కేసు నడుస్తోంది.

రాజధాని నిర్ణయం నిర్ణయం కేంద్రానిదా? రాష్ట్రానిదా అన్న అంశం మీద హైకోర్టులో విచారణ జరుగుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెలువరించింది.

రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే అని కేంద్రం తన అఫిడవిట్ లో తెలియజేసిందని ఏపీ సర్కార్ తెలిపింది.

రాజధానితోపాటు వివిధ అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులను సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కేంద్రం తెలిపిందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Tags:    

Similar News