అంతర్వేది ఘటనపై జగన్ సంచలనం...సీబీఐకి కేసు

Update: 2020-09-10 17:37 GMT
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని చారిత్రక రథం దగ్ధం ఘటన ఏపీతో పాటు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన సమగ్ర విచారణకు ఏఫీ డీజీపీని ఆదేశించారు. ఈ ఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో విపక్షాలు, హిందూ సంఘాలు సీబీఐ విచారణ కోరాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న జగన్...ఈ ఘటనపై కేంద్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అంతర్వేది ఘటనపై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని సీఎం జగన్ ప్రకటించారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను సీఎం జగన్ ఆదేశించారు.

ఈ ప్రకారం రాష్ట్ర డీజీపీ కార్యాలయం సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు లేఖ పంపింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ....రేపు జీవో వెలువడనుంది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారి చారిత్రక రథం దగ్ధం ఘటన ఏపీలో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు నిరసనగా అంతర్వేది ఆలయాన్ని సందర్శించేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ, జనసేన నేతలను పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా హౌస్‌ అరెస్ట్‌ చేయడం రాజకీయ దుమారం రేపింది . ఈ ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా`ధర్మ పరిరక్షణ దీక్ష`కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Tags:    

Similar News