జగన్ డేరింగ్ స్టెప్.. టీడీపీకి గట్టి దెబ్బ

Update: 2019-08-31 08:26 GMT
ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నేతలకు గత ప్రభుత్వంలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఇసుక రవాణాపై గట్టి దెబ్బకొట్టారు.    ఏపీ వ్యాప్తంగా మెజార్టీ ఇసుక రీచ్ లో ఇప్పుడు టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. అధికారం అడ్డుపెట్టుకొని చాలా మంది ఇసుక రవాణా టెండర్లను దక్కించుకొని అక్రమంగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం ఇసుక టెండర్లను రద్దు చేస్తున్నట్టు గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేయడం టీడీపీ నేతలకు షాకింగ్ మారింది.

జిల్లాల వారీగా ఇసుక టెండర్లను గమనించిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలకు మేలు చేసేందుకే కేవలం ఇసుక రవాణాకు కిలోమీటర్ కు  కేవలం రూ.1.90 పైసలకే కోట్ చేసి ఇసుక టెండర్లను దక్కించుకొని దోపిడీ చేశారని  నిగ్గుతేల్చింది. జిల్లా ఒకే కాంట్రాక్టర్ ను టీడీపీ నియమించగా.. ఇది దోపిడీకి ఆస్కారం లభిస్తుందని జగన్ ప్రభుత్వం ఇసుకరవాణా టెండర్లను రద్దు చేసింది.

ఇక తాజాగా కిలోమీటర్ కు రూ.4.90 ధర నిర్ణయిస్తూ జగన్ ప్రభుత్వం ఇసుక రవాణా టెండర్లు నిర్వహించాలని ప్రకటన జారీ చేిసంది. జీపీఎస్ ఉన్న ట్రక్కు యజమానులకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

జగన్ తీసుకున్న ఈ టెండర్ల రద్దుతో టీడీపీ అవాక్కైంది. మెజార్టీ ఇసుక టెండర్లు టీడీపీ నేతల చేతుల్లో ఉండడంతో దీన్ని రాజకీయం చేయాలని డిసైడ్ అయ్యినట్టు సమాచారం. జగన్ నిర్ణయం వల్ల రాష్ట్రంలో భవన నిర్మాణాలు ఆగిపోయాయంటూ కొత్తగా వివాదాన్ని రెచ్చగొట్టి యాగీచేయడానికి రెడీ అయ్యింది.
Tags:    

Similar News