కరోనా వైరస్ ..ఈ మహమ్మారి కారణంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ భయంకరమైన వైరస్ ఆ తరువాత ఒక్కొక్క దేశానికీ విస్తరిస్తూ ..ప్రపంచంలోని ప్రతి దేశానికీ పాకింది. ముఖ్యంగా ఇప్పుడు అమెరికా కరోనా దెబ్బకి వణికిపోతోంది. ఇకపోతే ఈ కరోనా మహమ్మారి కి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో ..ప్రపంచ దేశాలన్నీ కూడా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. దీనితో జన జీవనం మొత్తం స్తంభించింది.
ఈ లాక్ డౌన్ కారణంగా ఎవరు కూడా ఇంటి నుండి బయటకి రాలేని పరిస్థితి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా అన్ని పనులూ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. అందులోనూ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి.. పెళ్లిళ్లు చేసుకునే వారికి మరిన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. కరోనా ఎప్పుడు తగ్గుతుందా ఎప్పుడు లాక్డౌ న్ ఎత్తేస్తారా అని కొందరు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. లాక్ డౌన్ గడువు మే 3 తో ముగియనున్న నేపథ్యంలో మే 3 తరువాత లాక్ డౌన్ ఎత్తివేస్తే పెళ్లిళ్లు చేసుకునేందుకు పలువురు సిద్ధమవుతున్నారు.
అయితే ఇలాంటి వారి కోసం ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తూ పెళ్లిళ్లు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మే 3వ తేదీ తర్వాత పెళ్లి చేసుకునే వారికి అధికారిక అనుమతి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులోనూ ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో పలు రూల్స్ జారీ చేసింది. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె తరుపున కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది అని తెలిపింది. అలాగే ఖచ్చితంగా వారి వివరాలను రెవెన్యూ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ కు పంపాలని తెలిపారు. పెళ్లిలో భౌతిక దూరం పాటించాలని , ఒకవేల పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే మాస్కులు, శానిటైజర్లు తప్పకుండా వాడాలి అని తెలిపింది. అయితే, విజయనగరం జిల్లా ఇంతవరకూ గ్రీన్ జోన్ లో ఉన్నందున ఇతర జిల్లాలకు చెందిన వారితో సంబంధాలు కుదుర్చుకున్న పెళ్లిళ్లకు అనుమతులను నిరాకరిస్తున్నట్లు డీఆర్ వో వెంకటరావు తెలిపారు.