ప్రభుత్వ ఉద్యోగుల్ని ‘పది’తో కొట్టే కొత్త ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్
మేం చేసిన తప్పునకు ఈ మాత్రం తిప్పలు జరగాల్సిందేనంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మాటలు మరింత ఎక్కువయ్యేలా ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందా? పీఆర్సీ ఎపిసోడ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీ సర్కారు.. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో మరోసారి తొడపాశం పెట్టేలాంటి నిర్ణయం తీసుకుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
పీఆర్సీ ఎపిసోడ్ లో ప్రభుత్వాన్ని తమ నిరసనతో.. ఆందోళనతో ఇరుకున పెట్టిన ప్రభుత్వ ఉద్యోగులకు తనదైన ట్రీట్ మెంట్ ఇచ్చేలా ఏపీ ప్రభుత్వ ‘10’ పేరుతో ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో మరింత చిరాకును తెప్పించేలా ఉన్నట్లుగా చెబుతున్నారు.
తాజాగా విడుదల చేసిన ఉత్తర్వు ప్రకారం ఇకపై ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వచ్చి పంచ్ కొట్టాలి. ఒక పది నిమిషాలు ఆలస్యమైతే ఫర్లేదు. కానీ.. అంతకు మించి ఆలస్యం అయితే మాత్రం ఆ రోజును సెలవుదినంగా నిర్ణయిస్తామని స్పష్టం చేస్తోంది.
శనివారం విడుదలైన ఉత్తర్వు ప్రకారం చూసినప్పుడు ఉదయం 10 గంటలకు ఆఫీసులు రావాల్సిన ఉద్యోగులు ఒక పది నిమిషాలు ఆలస్యమైతే ఫర్లేదు కానీ.. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే.. సెలవుగా పరిగణిస్తారు.
అయితే.. ఇలా పది నిమిషాల పాటు ఆలస్యంగా వచ్చే అవకాశం.. నెలలో కేవలం మూడుసార్లు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఏపీ ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త చర్చకు తెర తీసిందని చెబుతున్నారు.
ఎవరైనా ఉత్తర్వుకు భిన్నంగా వ్యవహరిస్తే.. వారి సెలవుల్లో కోత పెట్టటం. .లేదంటే జీతాన్ని కోసి ఇవ్వటం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పీఆర్సీ.. ఇంక్రిమెంట్ లేదని గగ్గోలు పెడుతున్న ఉద్యోగులకు.. తాజాగా ఉదయం పది గంటలకు కచ్ఛితంగా ఆఫీసులో ఉండాలన్న ఉత్తర్వు.. వారికి షాకిచ్చేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని విడిచిపెట్టేందుకు ఏపీ సర్కారు సిద్ధంగా లేదన్న సంకేతాన్ని ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.