నిరుద్యోగుల ఆశలు నెరవేరబోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన గ్రామ సచివాలయం పోస్టుల పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తాజాగా తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈ ఫలితాలను విడుదల చేశారు.
గ్రామ వార్డు, సచివాలయాలకు సంబంధించిన 19 రకాల పోస్టులకు సర్కారు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం గ్రామాల్లోని 1,26,728 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి పరీక్షను నిర్వహించింది. దీనికి ఏపీ వ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు వారం పాటు నిర్వహించిన ఈ పరీక్షలకు 19 లక్షల 74వేల మంది హాజరయ్యారు.
కేవలం పది రోజుల వ్యవధిలోనే ఈ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేసి అందరినీ సంభ్రమాశ్చ్యారాలకు గురిచేశారు.
గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 1 వరకు శిక్షణ ఇస్తారు. అక్టోబర్ 2న పోస్టింగ్ ఇచ్చి విధుల్లో చేరుస్తారు. పరీక్ష నిర్వహించిన వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం సర్కారు నిబద్ధతకు నిదర్శనమని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స వ్యాఖ్యానించారు.
కాగా సచివాలయ పోస్టులకు ఎంపికైన వారు గ్రామాల్లోనే ఉంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు పర్యవేక్షించాలి. అర్హులకు అందించాలి. ప్రభుత్వ ఇతర సేవల్లో పాలుపంచుకోవాల్సి ఉంటుంది.
గ్రామ సచివాలయ పోస్టులను ఈ వెబ్ సైట్లలో చూసుకోవచ్చు..
http://gramasachivalayam.ap.gov.in/
http://vsws.ap.gov.in/
http://wardsachivalayam.ap.gov.in/
https://www.rtgs.ap.gov.in/