ఏపీ ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ పనితీరు ఏ స్థాయిలో ఉందో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది... ముఖ్యమంత్రి చంద్రబాబుకూ ఆ సంగతి అర్థమై వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ఎగ్జిట్ డోర్ చూపిస్తారని సమాచారం... ఇలాంటి తరుణంలోనూ మంత్రి తన చేతకానితనాన్ని మాటల్లో చూపించుకున్నారు. ''మన ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలనే కంట్రోల్ చేయలేం... అలాంటిది ఆసుపత్రుల్లో ఎలుకలను అదుపు చేయడం కష్టమే కదా'' అంటూ ఆయన నిర్లక్ష్య వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు ఏకంగా ఒక చిన్నారిని కొరికి చంపేసిన సంగతి తెలిసిందే... అంతటి హృదయ విదారక ఘటన, తీవ్రమైన నిర్లక్ష్య సంఘటన జరిగినప్పటికీ సాక్షాత్తు మంత్రి అంత తేలిగ్గా మాట్లాడడం విమర్శలకు దారితీస్తోంది.
ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసుపత్రిలో ఎలుకలను అదుపు చేయడం మానవసాధ్యం కాదని తేల్చేశారు.
కాగా మంత్రి కామినేని తన శాఖను సమర్థంగా నిర్వహించలేకపోతున్నారని చంద్రబాబు కూడా అనుకుంటున్నారు. నిజానికి చంద్రబాబుకు సన్నిహితుడైన కామినేనికి ఆయన మంచి శాఖనే ఇచ్చారు. అయితే... ఆయన మాత్రం దాన్ని సమర్థంగా నిర్వహించలేకపోతున్నారు. చంద్రబాబుతో వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నా పనితీరు బాగులేకపోవడంతో పాలనపై ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.