లోకేష్ లెక్క : జగన్ కంటే నాలుగు ఆకులు ఎక్కువేనట...?

Update: 2022-07-28 09:42 GMT
అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని ఒక వ్యంగ్య సామెత తెలుగులో ఉంది. అయితే రాజకీయాల్లో ఒకరి కంటే మరొకరు ఘనులుగా ఉండాలనే పంతంతో ముందుకు సాగుతారు. ఇక ఏపీలో చూస్తే వైసీపీకి అసలైన ఆల్టర్నేషన్ టీడీపీ అనే చెబుతారు. ఇక జగన్ కి ఈ రోజు చంద్రబాబు ప్రత్యర్ధిగా ఉన్న సమీప భవిష్యత్తులో ఆయన ప్లేస్ లో వచ్చేది లోకేష్ బాబే అని చెప్పాలి. వయసు రిత్యా సదూరమైన రాజకీయ పొరాటాల రిత్యా చూసుకున్నా జగన్ లోకేష్ లే ఏపీలో రేపటి రాజకీయ నేతలుగా నిలుస్తారు ఇక బాబు అంటే జగన్ తండ్రి సమకాలీకుడు. ఆయన ఇంకా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి జగన్ తో పోటీ పడాల్సి వచ్చింది.

రేపటి రోజున తాను రెస్ట్ తీసుకుని తనయుడిని ముందు పెట్టాలన్నదే బాబు ఆలోచన. ఈ వయసులో అందుకే ఆయన అలుపెరగకుండా ఏపీలో టూర్లు వేస్తున్నారు. 2024లో టీడీపీ గెలిస్తే లోకేష్ ని సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరు. తొలి రెండేళ్లు బాబు సీఎం గా ఉన్నా కూడా ఆ  తరువాత చినబాబు పట్టాభిషేకం జరిగి తీరుతుంది అని ఆ మాత్రం రాజకీయ అవగాహన ఉన్న అందరికీ తెలిసే విషయమే.

ఇక ప్రస్తుతానికైతే బాబు పేరు చెప్పే జనాలలోకి వెళ్తున్నారు. అటు పార్టీలో కూడా చంద్రబాబు నాయకత్వానికే సర్వామోదం ఉంది. అదే సమయంలో పార్టీలో యూత్ మాత్రం లోకేష్ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. చినబాబు నాయకత్వం  కావాలని కోరుకునే వారిలో జూనియర్లు ఎక్కువగా ఉన్నారు. సీనియర్లు ఎటూ బాబుకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన వయసు వారు అంతా కాబట్టి.

ఇక జనంలో చూసుకుంటే లోకేష్ ని బాగా ఫోకస్ చేయాలని బాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. తాను జనంలో ఉన్నా తనయుడికి కూడా మద్దతు కూడగట్టాలన్నదే ఆయన ఆలోచన. ఈ క్రమంలో పాదయత్రను డిజైన్ చేశారు అని తెలుస్తోంది. ఈ పాదయాత్ర ఎందుకు అంటే ఏపీ జనం మద్దతుని లోకేష్ పూర్తిగా కూడగట్టడానికే. జనంలో ఉంటేనే లీడర్ అవుతారు. ప్రమోట్ చేస్తే సీటు రావచ్చేమో కానీ ఫేట్ మారదు. ఈ సత్యం పూర్తిగా తెలిసిన చంద్రబాబు కొడుకు భవిష్యత్తుకు గట్టి భరోసా కల్పించేలా పాదయత్రను రూపకల్పన చేస్తున్నారు అని అంటున్నారు.

ఇక ఏడాది అక్టోబర్ లో లోకేష్ పాదయాత్ర ఉంటుందని మొదట్లో ప్రచారం జరిగినా ఆ టైం కి పవన్ కళ్యాణ్ బస్సు యాత్రతో రెడీ అవుతున్నారు. దాంతో దానికి ముందు వెనకా చేపట్టినా కూడా లోకేష్ పాదయాత్రకు అంత ఇంపాక్ట్ ఉండదని అంటున్నారు. దంతో ఏకంగా మరో మూడు నెలల పాటు పాదయాత్రం వాయిదా వేసుకున్నారని లేటెస్ట్ టాక్. అన్నీ కలసి వస్తే వచ్చే ఏడాది ఆరంభంలో  అంటే సంక్రాంతి పండుగ అయ్యాక రిపబ్లిక్ డే వంటి జాతీయ పండుగ వేళ లోకేష్ పాదం కదుపుతారని పాదయాత్రను స్టార్ట్ చేస్తారని అంటున్నారు.

ఇక పాదయాత్ర కూడా రాయలసీమ నుంచే ఉంటుందంట. అది చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లె కానీ లేక కుప్పం నియోజకవర్గం నుంచి కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మొత్తానికి మొత్తం 175 నియోజకవర్గాలు లోకేష్ కలియతిరిగేలా రూట్ మ్యాప్ ని రెడీ చేస్తున్నారు. ఇక లోకేష్ పాదయాత్ర ఏపీలో  ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ అంటే 2024 మర్చి దాకా కొనసాగుతుంది అని తెలుస్తోంది. ఎక్కడా విరామమే లేకుండా చినబాబు పాదయాత్ర అలా సాగిపోతుందట. అదే విధంగా జగన్ పాదయాత్రలో ఇప్పటిదాకా ఒక రికార్డుని నెలకొల్పారు. ఏకంగా 3,700 కిలోమీటర్ల  పైదాకా పాదయాత్ర జగన్ చేశారు. దాని బీట్ చేసేలా జగన్ రికార్డుని బద్ధలు కొట్టేలా చినబాబు పాదయాత్ర ఉంటుంది అంటున్నారు.

చినబాబు ఏకంగా నాలుగు వేల కిలోమీటర్లకు పైగా నడుస్తారు అని తెలుగుదేశం వర్గాల భోగట్టా. అంటే జగన్ కంటే నేనే నాలుగు ఆకులు ఎక్కువ చదివాను సుమా అని లోకానికి జనాలకు, రాజకీయ పార్టీలకు తెలియచేయడమే లోకేష్ అజెండా అని తెలుస్తోంది. ఈ పాదయాత్ర అంతా ఫుల్ యూత్ ఉండేలా చూస్తారని చెబుతున్నారు. అలాగే పల్లెలు చుట్టూనే ఈ యాత్ర సాగుతుంది అని తెలుస్తోంది. మొత్తానికి యాత్ర పూర్తి అయ్యేసరికి సీఎం లోకేష్ అని తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కూడా మద్దతు ఇచ్చేలా సీన్ మారిపోతుంది అని తెలుగుదేశం వర్గాలు గట్టి ఆశలే పెట్టుకుంటున్నాయి.
Tags:    

Similar News