డబ్బుల పంపిణీ:బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు

Update: 2019-02-24 05:22 GMT
ప్రముఖ నటుడు - టీడీపీ ఎమ్మెల్యే బాలక్రిష్ణ చిక్కుల్లో పడ్డాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన ఉదంతంలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

నంద్యాల ఉప ఎన్నికల సందర్శంగా టీడీపీ తరుఫున ప్రచారానికి వచ్చిన బాలయ్య ఓటర్లకు డబ్బులు పంచుతూ మీడియా కంట పడ్డారు. ఆ వీడియో ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా ప్రసారమైంది. బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన బాలక్రిష్ణపై ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల కింద కేసు చేయాలని కే శివకుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై   హైకోర్టు ధర్మాసనం విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో బాలక్రిష్ణ వాదనలు వినడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.  బాలక్రిష్ణకు నోటీసులు జారీ చేసింది.

అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.


Tags:    

Similar News