ఏపీలో హాట్ హాట్ గా సాగుతున్న పంచాయితీ ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వస్తున్నాయి. ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుముఖంగా లేదన్న విమరశ పెద్ద ఎత్తున వినిపించేది. అందుకోసమే ఎన్నికల నిర్వహణకు ఇష్టపడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తినా.. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా అధికార పార్టీకి భారీ అధిక్యత వెల్లడవుతోంది. ఇదిలా ఉంటే.. పంచాయితీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని కోరుతూ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును ఇచ్చింది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని ఏదైనా పంచాయితీలో ఒక్క ఓటరు కోరినా.. సంబంధిత పంచాయితీలో వీడియో తీయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్ని నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికల్లో పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేసింది.
పంచాయితీ ఎన్నికల ఓట్ల లెక్కింపును సీసీ కెమెరాలో రికార్డు చేయాలని.. లేదంటే వీడియో తీయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 13న ఇచ్చిన ఉత్తర్వును అమలు చేసేలా జిల్లా ఎన్నికల అధికారుల్ని ఆదేశించాలని కోరుతూ క్రిష్ణా.. గుంటూరు జిల్లాలకు చెందిన శ్రీపతి నాంచారయ్య.. ఎం.ప్రతాప్ నాయక్ లు హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం వేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలన్న ఆదేశాలు అమలు కావటం లేదన్నారు.
మూడు.. నాలుగో విడత పంచాయితీ ఎన్నికలు ఈ నెల 17.. 21న జరుగుతున్న నేపథ్యంలో వాటిని రికార్డు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిసతూ.. పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేనని పేర్కొన్నారు. దీంతో.. సమస్యాత్మక ప్రాంతాల్ని ఏ రీతిలో నిర్ణయిస్తున్నారో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు కోరింది. అదే సమయంలో.. ఓట్ల లెక్కింపును ఏ ఒక్క ఓటరు అడిగినా వీడియో తీయాలన్న ఆదేశాల్ని జారీ చేసింది. మరి.. మిగిలిన రెండు దఫాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.