నిమ్మగడ్డ 'ఈవాచ్'కు చెక్.. షాకిచ్చిన ఏపీ హైకోర్టు

Update: 2021-02-09 16:50 GMT
ఏపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల కేంద్రంగా ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకు నిమ్మగడ్డ తీసుకొచ్చిన 'ఈవాచ్' యాప్ కు చెక్ పడింది.

ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా ఈ యాప్ ను తీసుకొచ్చిన నిమ్మగడ్డకు హైకోర్టులో నిరాశ ఎదురుదైంది. ఏపీలో  పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. సంప్రదించకుండా సొంతంగా 'ఈ-వాచ్' యాప్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చని.. ఫిర్యాదుల సమస్యల పరిష్కారానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని లాంచ్ చేశారు.

అయితే నిమ్మగడ్డ రూపొందించిన 'ఈ-వాచ్' యాప్ పై ఏపీ ప్రభుత్వం సహా పలువురు దాఖలు చేసిన పిటీషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన ఈ-వాచ్ యాప్ ను 9వ తేది వరకు ఆపరేట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది.సెక్యూరిటీ పరిశీలన లేకుండా ఈ యాప్ ను ఉపయోగించడానికి వీల్లేదని పిటీషనర్లు కోరారు. ప్రభుత్వ యాప్ ఉండగా.. ఈ యాప్ ను ఎందుకు చేశారని పిటీషనర్లు ప్రశ్నించారు.

ఎస్ఈసీ తీసుకొచ్చి ఈవాచ్ యాప్ కు భద్రతా అనుమతులు తీసుకోకపోవడంతోపాటు వాటికోసం దరఖాస్తు చేసినా ఆలస్యం అవుతుండడం వంటి కారణాలతో యాప్ కు చుక్కెదురైంది. ఈ యాప్ ను గుర్తించేందుకు హైకోర్టు నిరాకరించింది.దీంతో ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నిఘా యాప్ తోపాటు సీక్యాప్ యాప్ ను వాడుకుంటామని ఎస్ఈసీ తరుఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈయాపస్ పై తదుపరి విచారణను ఈనెల 17కు కోర్టు వాయిదా వేసింది.
Tags:    

Similar News