లోకేష్ ఢిల్లీ టూర్ వెనుక లాజిక్ ఏంటో?

Update: 2017-05-08 18:11 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, యువ మంత్రి నారా లోకేష్ త‌న దూకుడు పెంచుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఐటీ, పంచాయ‌తీరాజ్ శాఖా మంత్రిగా గ‌త నెల బాధ్య‌త‌లు స్వీక‌రించిన లోకేష్ ఇప్ప‌టికే రాష్ట్రంలో జోరుగా ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో  హ‌ల్‌చ‌ల్ చేసేందుకు లోకేష్ స్కెచ్ రూపొందించారు.  రేపటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు.  మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం లోకేష్ ఢిల్లీలో పర్యటించడం ఇదే మొదటి సారి.

ఢిల్లీకి మొద‌టిసారి ప‌య‌న‌మ‌వుతున్న సంద‌ర్భంగా తన రెండు రోజుల పర్యటనలో లోకేష్ పలువురు కేంద్ర మంత్రులు, ఐటీ కంపెనీల సీఈవోలతోనూ భేటీ కానున్నారని స‌మాచారం. పంచాయ‌తీ రాజ్ శాఖా మంత్రిగా ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ కేంద్ర‌మంత్రుల నిధుల కేటాయింపుపై ప్ర‌తిపాద‌న‌లు పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటు చేయ‌డం ద్వారా క‌లిగే లాభాల‌ను వివ‌రిస్తూ ప‌లు కంపెనీల సీఈఓల‌కు ప్ర‌తిపాద‌న‌లు అందించ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా, సీఎం చంద్ర‌బాబు అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ స‌మ‌యంలో లోకేష్ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News