ఏపీ మంత్రి బ్యాంకాక్ లీలలు టీడీపీ చేతికి?

Update: 2020-09-17 10:30 GMT
2019 ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. ఏకంగా 151 సీట్లను గెలిపించి జగన్ సగర్వంగా సీఎం అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక 5 రోజులు కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లాడు.

అప్పుడు కొందరు మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే టాక్ ఉంది. తామెందుకు పోవద్దని వాళ్లకు ఇష్టమైన ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లారంట..అయితే అదేమీ పెద్ద విశేషం కాకున్నా.. ఒక మంత్రి మాత్రం థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ లో ఉన్న ఒక ప్రదేశానికి తెలంగాణకు చెందిన ఒక మహిళా నేతతో కలిసి వెళ్లాడట.. అక్కడ చెట్టాపట్టాలేసుకొని తిరిగాడట.. ఇప్పుడా వీడియో టీడీపీ చేతిలో పడిందని భోగట్టా. అది సమయం వచ్చినప్పుడు బయటకు తీసి ఆ మంత్రిని ఇబ్బంది పెట్టాలని టీడీపీ చూస్తోందట..

బ్యాంకాక్ లోని ఓ వీధిలో ఆ మంత్రి తెలంగాణ మహిళా నేతతో తిరుగుతున్నట్టు పక్కాగా ఆ వీడియోలో ఉందని అంటున్నారు. అయితే రాసుకుపూసుకు తిరిగినట్టు లేకున్నా.. మంత్రి వీడియోలో కనిపించడంతో వైరల్ అయ్యింది. అది కాస్తా టీడీపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందట.. మరి మంత్రి విదేశీ టూర్ లో ఆ విషయం యాదృశ్చికంగా జరిగిందా? ఆ మంత్రి పర్సనల్ ట్రిప్ కి వెళితే ఆ మహిళా లీడర్ అక్కడ ఉన్నదా? అదంత కామన్ గా జరిగిందా? అన్నది పూర్తి విషయం తెలియదు కానీ.. టీడీపీ ఆఫీసులో ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట..

ఆ వీడియో ఎప్పుడు రిలీజ్ చేయాలి? ఈ సమస్యల్లో రిలీజ్ చేయొచ్చా? ఆ వీడియో రిలీజ్ చేస్తే ఆ మంత్రి పని అయిపోతుందని.. దానిని వైసీపీకి అంటగట్టాలని చూస్తున్నారంట.. మరి ఈ విషయం బెదిరించడానికా? అని అంటున్నారా? లేక నిజంగా అంటున్నారా తెలియదు.. టీడీపీ ఫ్రూఫ్ లు లేకుండానే వంద చెప్తుంటుంది. వాళ్ల దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేవా అనేది చూడాలి. ఈ విషయం ను పెద్ద దుమారం లేపాలని టీడీపీ చూస్తోందట. ఈ మేరకు ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. ఎందుకంటే.. వాళ్ల చేతిలో చానెల్స్, మీడియా ఉంది కాబట్టి ఏదో ఒకటి రాష్ట్రంలో గలాబా చేయాలని చూస్తోందని నెటిజన్లు అంటున్నారు.
Tags:    

Similar News