ఏపీ మంత్రి నారాయ‌ణ‌కు పుత్ర‌శోకం

Update: 2017-05-10 03:08 GMT
ఏపీ మంత్రి నారాయ‌ణ‌కు తీర‌ని శోక‌మిది. బుధ‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న కుమారుడు నిషిత్ నారాయ‌ణ (23) దుర్మ‌రణం పాల‌య్యారు. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న స్నేహితుడు రాజా ర‌వివ‌ర్మ ప్రాణాలు కోల్పోయారు. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబ‌రు 36 వ‌ద్ద చోటు చేసుకున్న ప్ర‌మాదంలో వీరిద్ద‌రూ మ‌ర‌ణించారు. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత‌.. బుధ‌వారం తెల్ల‌వారు జామున 2.30 గంట‌ల నుంచి మూడు గంట‌ల మ‌ధ్య‌లో మంత్రి కుమారుడు నిషిత్ ప్ర‌యాణిస్తున్న కారు అతి వేగంగా వ‌చ్చి మెట్రో ఫిల్ల‌ర్‌ ను ఢీ కొట్టిన‌ట్లుగా చెబుతున్నారు. బెంజ్ కారులో ప్ర‌యాణిస్తున్న‌ప్ప‌టికీ.. కారు వేగం చాలా ఎక్కువ‌గా ఉండ‌టంతో గాయాల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. కారులోప‌ల బెలూన్లు ఓపెన్ అయిన‌ప్ప‌టికీ.. తీవ్ర గాయాల‌య్యారు.

రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు.. ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డింది ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు నిషిత్ అన్న విష‌యం తెలీదు. పోలీసులు వ‌చ్చే వ‌ర‌కూ ఈ విష‌యాన్ని ఎవ‌రూ గుర్తించ‌లేదు. ప్ర‌మాదం చోటు చేసుకున్న వెంట‌నే.. అక్క‌డున్న మున్సిప‌ల్ సిబ్బంది వారిని.. అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు.అయితే.. ఆసుప‌త్రికి చేరుకునేస‌రికే ఇరువురు మృతి చెందిన‌ట్లుగా వైద్యులు గుర్తించారు.  ఇటీవ‌లే నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌కు డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు నిషిత్‌.

మ‌రోవైపు.. ఏపీ అధికారిక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంత్రి నారాయ‌ణ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. కుమారుడి మ‌ర‌ణ‌వార్త విన్న వెంట‌నే.. ఆయ‌న హుటాహుటిన భార‌త్‌ కు బ‌య‌లుదేరారు. ఈ సాయంత్రానికి నెల్లూరుకు చేరుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. కొడుకు మృతి వార్త విన్న వెంట‌నే నారాయ‌ణ స‌తీమ‌ణి.. కుటుంబ స‌భ్యులు.. స‌న్నిహితులు పెద్ద ఎత్తున ఆసుప‌త్రికి చేరుకుంటున్నారు.

నిషిత్ మ‌ర‌ణ‌వార్త విన్న వెంట‌నే.. త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకొని ఏపీ మంత్రి లోకేశ్ హైద‌రాబాద్‌ కు వ‌స్తున్నారు. అపోలో ఆసుప‌త్రికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు..నారాయ‌ణ  కుటుంబ స‌భ్యుల‌కు త‌మ ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. నిషిత్‌.. రాజా ర‌వివ‌ర్మ మృత‌దేహాల‌కు ఉస్మానియా ఆసుప‌త్రిలో పోస్ట్ మార్టం నిర్వ‌హించేందుకు త‌ర‌లించారు. పోస్టుమార్టం పూర్తి అయిన త‌ర్వాత‌.. నిషిత్ భౌతిక‌కాయాన్ని నెల్లూరుకు త‌ర‌లిస్తార‌ని చెబుతున్నారు. ఊహించ‌ని వార్త‌తో.. నారాయ‌ణ కుటుంబ స‌భ్యులు.. మిత్రులు.. విద్యాసంస్థ‌లకు చెందిన వారు తీవ్ర షాక్‌కు గురి అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వివిధ పార్టీల నేత‌లు నిషిత్ మ‌ర‌ణంపై తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News