దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ భారీగా వ్యాప్తి చెందుతుంది. ఇక తెలంగాణ లో కూడా రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీనితో కరోనా నియమాలని పోలీసులు చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరైనా సరే మాస్క్ ధరించకపోతే చుక్కలు చూపిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే ప్రభుత్వ అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వనపర్తి జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డికి రూ. 1 వెయ్యి జరిమానా విధించి షాక్ ఇచ్చారు.
ఎస్ ఎన్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో శుక్రవారం అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభ కార్యక్రమానికి వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే లోకనాథ్ రెడ్డి మాస్క్ ధరించకపోవడంతో మంత్రి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా విధించాలని పోలీసులకు సూచించారు. దీంతో లోకనాథ్ రెడ్డికి రూ. 1 వెయ్యి జరిమానా విధిస్తూ ఎస్ ఐ రశీదు రాసి ఆయన చేతికిచ్చారు. మంత్రి సమక్షంలోనే జరిగిన ఈ తతంగంతో జడ్పీ ఛైర్మన్ షాక్ కు గురయ్యారు. ప్రభుత్వం నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందేనని, ప్రజాప్రతినిధులే వాటిని మీరితే ప్రజల్లో ఏం గౌరవం ఉంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ ఘటనతో ఆ కార్యక్రమానికి వచ్చిన వారు కూడా షాకయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే ఎవరికైనా జరిమానాలు తప్పవని పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.