అమరావతిపై మనసు మారదట.. మూడుపై ప్లాన్ మారుస్తారట.. మంత్రి కామెంట్లు
ఏపీ రాజధాని అమరావతి విషయంలో మనసు మారదు కానీ.. మూడురాజధానుల విషయంలో ఏమైనా ప్లాన్ మార్చాలంటే మాత్రం మారుస్తామని.. దీనికి సంబంధించి ఎవరు సూచనలు ఇచ్చినా..సలహాలు ఇచ్చినా.. పరిశీలిస్తామని ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మనప్రసాదరావు వ్యాఖ్యానించారు. అయితే.. అన్ని తెలిసిన.. అత్యంత సీనియర్ అయిన.. మంత్రి ఇలా వ్యాఖ్యలు చేయడం.. సరికాదనేది.. నెటిజన్ల మాట.
ఇంతకీ.. ధర్మాన ఏమన్నారంటే..టీడీపీ పాలనలోనే రాజధాని విషయంలో మోసం జరిగిందని ప్రసాదరావు విమర్శించారు. తాజాగా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసం గించారు.
చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదో గతంలో ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. పునర్విభన చట్టం ప్రకారం వేసిన శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయానికే ప్రస్తుతం కట్టుబడి ఉందన్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్ 6లో ప్రస్తావించిన అనేక అంశాలు పరిశీలించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గౌరవిస్తే బాగుండేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మేధావులు చెప్పిన అంశాలను పక్కనపెట్టి అమరావతి రాజధానిగా చంద్రబాబు పెట్టారన్నారు. రాజధాని అత్యంత ప్రాధాన్యత అంశం.. అందుకే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తీసుకుని రాజధాని ఏర్పాటు చేయాల్సిందని కమిషన్ చెప్పిందని మంత్రి గుర్తు చేశారు.
అన్ని రాష్ట్రాలు కూడా తమ రెవిన్యూల నుంచి రూ.10 కోట్లు ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అమరావతి రైతుల ఆవేదన కరెక్ట్ కావచ్చు అని... అయితే విశాఖ పరిపాలన రాజధాని కావద్దని చంద్రబాబు చెబితే తాము ఊరుకోవాలా అని అన్నారు.
మూడు రాజధానుల విషయంలో మంచి నిర్ణయాలు వస్తే మార్పు చేయ టానికి తాము ఇప్పటికి సిద్ధంగా ఉన్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. అయితే.. నెటిజన్లు మాత్రం ఈ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. అన్నీ తెలిసిన సీనియర్ నాయకుడు ఇలా వ్యాఖ్యానించడం సరికాదని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.