తిరుపతి రుయా ఘటనలో ఆరుగురు అరెస్ట్

Update: 2022-04-27 08:30 GMT
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆంబులెన్స్ మాఫియాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఓ బిడ్డ చనిపోతే అంబులెన్స్ దోపిడీని తట్టుకోలేక ఓ తండ్రి 90 కి.మీలు ఆ బాలుడి శవంతో బైక్ పై ప్రయాణించిన తీరు అందరినీ కలిచివేసింది. మీడియాలో దీన్ని ప్రసారం చేసి మానవీయతను చాటడంతో అందరూ స్పందించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్న ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేసింది.

తిరుపతికి చెందిన అంబులెన్స్ డ్రైవర్లు నరసింహులు, క్రిష్ణమూర్తి, దొరైరాజ్, దామోదర్, ప్రభు, శేఖర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్లు అందరూ మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేలింది.

అంబులెన్స్ ధరలను నిర్ధేశిస్తూ స్విమ్స్, రుయా ఆస్పత్రి వద్ద బోర్డులను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకట రమణరెడ్డి అన్నారు. నిర్ధేశిత ధరల కన్నా.. ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కేసులు పెడుతామన్నారు.

తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సూపరింటెండెంట్ కు షోకాజ్ నోటీసులిచ్చామన్నారు.ఆర్ఎంవోను సస్పెండ్  చేశామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అలర్ట్ గా ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా గూడూరు నియోజకవర్గంలో నివాసముంటే నర్సింహులు పంట చేలకు కాపలా ఉంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి ఓ కొడుకు ఉన్నాడు. అయితే అతడు వ్యాధి బారిన పడటంతో అతడిని తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేర్చాడు. కానీ వ్యాధి నయం కాకపోవడంతో కొడుకు ఇవాళ కన్నుమూశాడు. దీంతో 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి శవాన్ని తరలించేందుకు అంబులెన్స్ కావాలని అడిగాడు.

దీనికి వారు రూ. 20 వేలు కావాలని చెప్పారు.తన వద్ద అంత డబ్బు లేదని తాను ఓ పేదవాడినని బతిమాలాడు. అయినా డ్రైవర్లు కరగలేదు. దీంతో అతడు బయట ఉన్న ప్రైవేటు అంబులెన్స్ ను సంప్రదిస్తే అతడు రూ. 8 వేలు ఇవ్వాలని సూచించాడు. దీనికి అతడు సరే అన్నా ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్లు ససేమిరా అన్నారు. ప్రైవేటు అంబులెన్స్ ను లోనికి రానివ్వమని బెదరించారు. దీంతో బాధితుడు ఎంత తలబాదుకున్నా వినలేదు.

ఇక చేసేందేం లేక శవాన్ని ద్విచక్ర వాహనంపై వేసుకుని తన సొంతూరు తరలించాడు. అంబులెన్స్ డ్రైవర్లు ఇంత కర్కశంగా ఉంటారా అనే అనుమానం కలుగుతోంది. ఆపద లో ఉన్న వారికి సాయపడాల్సింది పోయి ముూర్ఖంగా వాదించి అతడిని ఇబ్బందులకు గురిచేసిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
Tags:    

Similar News