చిత్రం ఏంటో కానీ.. ఏపీ స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారాంకు.. ఇంటా బయటా కూడా సెగ తగులుతోందని అంటున్నారు. ఆయ న ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్నప్పటికీ.. రాజకీయంగా దూకుడుగా ఉన్నారు. తన మనసంతా.. మంత్రి పదవిపైనే ఉంది. అలాగని.. సీఎం జగన్ ఇప్పట్లో.. మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే పరిస్థితి కనిపించడం లేదు. సో.. దీంతో మానసికంగా ఆయన వేదనలో ఉన్నారు. మరోవైపు.. నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. అదే తాను స్పీకర్‌గా ఉండకపోతే.. వేరే రూట్‌లో అయినా.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి.. నియోజకవర్గానికి నిధులు తెచ్చుకునే వెసులు బాటు ఉండేదని వాపోతున్నారు. ఇంకోవైపు.. టీడీపీ దూకుడు నియోజకవర్గంలో పెరిగిపోయింది.
ఈ పరిణామాలతో స్పీకర్ పరిస్థితి ఇరకాటంలో పడిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. స్పీకర్ నియోజకవర్గంలో అభివృద్ధి లేదంటూ.. ఆముదాల వలస నియోజకవర్గం ప్రజలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో తనదైన మార్కు వేయకపోతే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడం కష్టమని పరిశీలకులు చెబుతున్నారు. ఎందు కంటే.. గత ఎన్నికల్లో ఇక్కడ విజయం కేవలం 13 వేల ఓట్ల తేడాతోనే స్పీకర్‌కు లభించింది.
అయితే.. వచ్చే ఎన్నికల్లో పోరు మరింత తీవ్రంగా ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. పొత్తులతో మహాకూటమి ఏర్పడితే.. మూడు పార్టీలకు సంబంధించిన ఓట్లు.. ఒకరికే పడే అవకాశం ఉంటుంది. ఇది స్పీకర్‌కు మరింత ఇబ్బందిగా మారుతుంది. అదేసమయంలో మరో రెండేళ్లలోనే ఎన్నికలు ఉన్నందున ఆయన ఇప్పటి నుంచి అభివృద్ధిపై దృష్టి పెట్టకపోయినా.. ఇబ్బంది తప్పదు. మరోవైపు టీడీపీ నాయకుడు కూన రవికుమార్ దూకుడు పెంచు తున్నారు. ఆయనకు దీటుగా సీతారాం రాజకీయ దూకుడు పెంచేందుకు పదవి అడ్డం వస్తోంది.
అయినప్పటికి ఒక్కొక్కసారి దూకుడు చూపుతున్నా.. విమర్శలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. స్పీకర్‌కు సెంటిమెంటు కూడా అడ్డంకిగా మారింది. ఇప్పటి వరకు స్పీకర్లుగా పనిచేసిన వారు..తర్వాత ఎన్నికల్లో గెలిచిన సందర్భం ఒక్కటి కూడా లేదు. సో.. ఇలా అన్ని వైపులా కూడా స్పీకర్ పరిస్థితి ఏమీ బాగోలేదనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ తట్టుకుని ఆయన ఏమేరకు నిలబడతారో.. విజయం దిశగా తొడగొడతారో చూడాలి..!