ఏపీలో వ‌లంటీర్ల‌పై 'సాక్షి' క‌త్తి...!

Update: 2022-11-17 02:30 GMT
రాష్ట్రంలో ప్ర‌భుత్వానికి-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధులుగా ఉన్న వ‌లంటీర్ల‌పై ఇప్పుడు మ‌రో క‌త్తి వేలాడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక కార్య‌క్ర‌మాల్లో తేడా వ‌స్తే.. తీసేస్తామ‌ని.. ప్ర‌క‌టిస్తూ అలానే చేస్తున్న వైసీపీ ప్ర‌భుత్వం దెబ్బ‌కు వ‌లంటీర్లు అల్లాడి పోతున్నారు.

ఎక్క‌డ ఏ చిన్న తేడావ‌చ్చినా.. వెంట‌నే ఇంటికి పంపేస్తుండ‌డంతో వారు ఏం చేయాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతున్నారు. ఇలాంటి క‌త్తిమీద సాము ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నామా? అనివారు అల్లాడుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వారికి మ‌రో స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.

అదే.. అధికార పార్టీ వైసీపీకి మాన‌స‌పుత్రిక‌.. సాక్షి! రెండు నెల‌ల కింద‌ట‌. వ‌లంటీర్ల‌ను ఉద్దేశించి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కొన్ని అంశాల‌ను ప్ర‌శ్నించారు. ముఖ్యంగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు.. వాటిలోని ల‌క్ష్యాలు.. ఆయా ప‌థ‌కాలు ఎవ‌రికి అందుతున్నాయి?  ఎవ‌రికి అందాలి?  ఆయా ప‌థ‌కా ల‌కు ప్ర‌భుత్వం పెడుతున్న ఖ‌ర్చు.. వంటి అనేక అంశాల‌ను ఆయ‌న వ‌లంటీర్ల‌ను ప్ర‌శ్నించారు.అయితే, వీరిలో చాలా చాలా త‌క్కువ మంది మాత్ర‌మే వాటికి స‌మాధానం చెప్పారు. దీంతో వలంటీర్లు జ్ఞానం పెంచుకోవాల‌ని సీఎం సూచించారు.

అంతేకాదు.. రోజూ పేప‌ర్ చ‌ద‌వాల‌ని కూడా వారికి హిత‌వు ప‌లికారు. ఈ క్ర‌మంలో ఒక‌రిద్ద‌రు త‌మ‌కు ఇస్తున్న వేత‌నంతో పేప‌ర్లు కొనే ప‌రిస్థితి లేద‌ని చెప్ప‌డంతో వెంట‌రూ.. రూ.200 చొప్పున నెల‌నెలా అద‌నంగా ఇవ్వాలని జ‌గ‌న్ అప్ప‌టిక‌ప్పుడే ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆ స‌మ‌యంలో వ‌లంటీర్లు ఏ ప‌త్రిక కొనాలి? అనే విష‌యాన్ని చెప్పలేదు. కానీ, రెండు రోజుల త‌ర్వాత‌.. సాక్షినే కొనుగోలు చేయాలంటూ.. అధికారికంగా ఉత్త‌ర్వులు వ‌చ్చాయి. దీంతో వ‌లంటీర్లు పేప‌ర్ కొంటున్నారు. అయితే, ఇది నిర్బంధం కాక‌పోవ‌డంతో.. వారు కొన్ని సార్లు నెగ్‌లెక్ట్ చేస్తున్నారు.

దీనిపై ఇటీవ‌ల స‌చివాల‌యాల కార్య‌ద‌ర్శుల‌కు మెమో ఇచ్చారు. ఇదిలావుంటే, సాక్షిని కొనుగోలు చేస్తున్న వ‌లంటీర్లు.. ప్ర‌భుత్వం ఇస్తున్న రూ.200 ల‌నుచెల్లించ‌డం లేద‌ని ప‌త్రిక ఏజెంట్లు ఫిర్యాదులు చేశారు.

దీంతో ఇప్పుడు ఖ‌చ్చితంగా.. బిల్లులు చెల్లించాల‌ని అధికారుల నుంచి నేరుగా వ‌లంటీర్ల‌కు ఆదేశాలు అందాయి. ఈ నెల కు స‌రే.. లేక‌పోతే.. వ‌చ్చే నెల నుంచి  ఉద్యోగాల నుంచి పీకేస్తామ‌ని హెచ్చ‌రించ‌డం కొస‌మెరుపు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాఉంగుటూరు మండ‌లంలో వెలుగు చూసిన ఈ ఘ‌ట‌న త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా పాకే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News