వైసీపీ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి రహస్యాలు అన్నవి బహిరంగ రహస్యాలుగానే మారిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉంచాల్సిన మ్యాటర్స్ కూడా లీక్ అయిపోతూ వస్తున్నాయి. దాని వల్ల వైసీపీ టోటల్ వ్యూహాలే తల్లకిందులు అవుతున్నాయి. దీంతో హై కమాండ్ ఇబ్బందులో పడుతోంది. లేటెస్ట్ గా చూస్తే వైసీపీ సీక్రెట్ మ్యాటర్ గా ఉన్న ముందస్తు ఎన్నికల వ్యవహారం లీక్ అయిందా అనందే బిగ్ డిబేట్. నిజానికి ముందస్తు అన్నది కేంద్రం మాట. వారిదే ఆ ముచ్చట. అది జగన్ సీఎం అయిన తొలి ఏడాది నుంచే వినిపిస్తూ వచ్చింది.
అప్పట్లో టీడీపీ చంద్రబాబు పదే పదే ఆ మాటను అంటూండేవారు. దేశాన జమిలి ఎన్నికలు రావడం ఖాయం. వైసీపీ సర్కార్ ఆయుష్షు మూడేళ్ళు మాత్రమే అని కూడా చెబుతూ ఉండేవారు. ఇక కేంద్రం జమిలికి సిద్ధపడితే వైసీపీ కూడా అడుగులో అడుగేయడానికి రెడీగా ఉందని నాడు వార్తలు వినిపించాయి.
అయితే కేంద్రం మాత్రం ఆ ఆలోచనల నుంచి విరమించుకుంది. ఏడాది క్రితమే దాని మీద క్లారిటీ వచ్చేసింది. దీంతో ఏపీలో విపక్షం ఉసూరుమంది. కానీ ఆ తరువాత కొద్ది నెలలుగా చూస్తే అధికార పార్టీ దూకుడు పెంచింది. ఇది కావాలని చేస్తున్నారా లేక మరేదైనా వ్యూహం ఉందా అన్నది కనుక చూస్తే వైసీపీ సర్కార్ రెండు విధాలుగానూ ఆలోచిస్తోంది అనే అంటారు.
ముందస్తు విషయంలో చాలా కారణాలు కూడా అవకాశాన్ని కొట్టిపారేయలేకుండా చేస్తున్నాయి. అప్పులు పెరిగిపోయాయి. కొత్తవి పుట్టడంలేదు, దాంతో సంక్షేమ రధానికి ఏదో రోజు బ్రేకు పడడం ఖాయం. ఈ నేపధ్యంలో కనుక చూస్తే ఎన్నికలకు తొందరగా వెళ్ళడం ద్వారా తమ సత్య శీలతను నిరూపించుకోవడమే అధినాయకత్వం ముందున్న సరైన ఆప్షన్ అని అంటున్నారు.
అంటే హామీలు అమలు చేశామని చెబుతూనే చాలా ముందరగా జనాభిప్రాయాన్ని కోరడం. అలాగే అభివృద్ధి లేమితో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, కరోనా తరువాత మారిన దిగజారిన ప్రజల జీవన ప్రమాణాలు, పెరుగుతున్న నిరుద్యోగం, దేనికీ సరైన పరిష్కారం చూపించలేని వైనం ఇవన్నీ వెరసి వైసీపీకి అయిదేళ్ళ కాలంలో ఇబ్బందులు తెస్తాయి. దాన్ని కుదించుకుంటే సేఫ్ అన్న ఆలోచన ఉంది.
అందుకే ఏడాది ముందుగా ఎన్నికలకు వెళ్ళాలి అన్న ఆలోచన ఏదో ప్రభుత్వానికి ఉన్నట్లుంది అంటున్నారు. దూకుడు పెంచారు, గడప గడపకు ప్రభుత్వం అంటున్నారు. మంత్రుల బస్సు యాత్ర పెట్టారు, సీఎం ప్రసంగాల్లో వేడి పెంచారు. ఇవన్నీ సంకేతాలుగా ఉన్నా కూడా విపక్షాలు అయితే పెద్దగా నమ్మలేదు. జనసేనాని పవన్ వంటి వారు తమ సినిమాలు తాము చేసుకుంటూ రాజకీయాలు నెమ్మదిగా చేస్తూ వచ్చారు.
కానీ సడెన్ గా పవన్ బస్సు యాత్ర అని ప్రకటించడమే ఇక్కడ బిగ్ ట్విస్ట్. దానికి కారణం ఏంటి అన్నదే అందరూ ఆలోచిస్తున్నారు. చేతిలో సినిమాలతో బిజీగా ఉన్న పవన్ సడెన్ గా రోడ్ల మీదకు రారు కదా. అంటే ఆయనకు కచ్చితమైన విషయం ఏదో ముందస్తు ఎన్నికల మీద లభించి ఉండాలని అంటున్నారు.
బీజేపీతో మితృత్వం ఉన్న పవన్ కి ఆ ఢిల్లీ పెద్దల నుంచి ఈ సీక్రెట్ తెలిసి ఉంటుందని అంటున్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్త ఆయనకు చాలా సోర్సెస్ ఉన్నాయి. దాంతో ఆయన బాదుడే బాదుడుతో చాలా రోజుల ముందే జనాల్లోకి వచ్చేశారు. మొత్తానికి కీలకమైన విపక్షాలు జనంలోకి దిగిపోయాయి.
దాంతో ముందస్తు ఎన్నికలు పెట్టి విపక్షాలు ఏమరుపాటుగా ఉండగానే పబ్బం గడుపుకుందామని, మళ్ళీ ఎంతో కొంత మెజారిటీతో పవర్ దక్కించుకుందామని వైసీపీ వేసిన ప్లాన్ ఏమైనా బెడిసికొట్టిందా అన్న చర్చ అయితే సాగుతోంది. మొత్తం మీద చూస్తే ముందస్తు ముచ్చట వచ్చే ఏడాది మార్చిలో అని కూడా జనసేన ముహూర్తం సైతం చెప్పేస్తోంది. మరి నిజంగా అదే అయితే కనుక వైసీపీ సీక్రెట్ కాకెత్తికెళ్ళినట్లే. ముందస్తు అన్నా విజయోస్తు తధాస్తూ అని ప్రజా దేవతలు దీవిస్తారా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే.