జగన్ ను రిసీవ్ చేసుకోవడానికి రాని మంత్రులు!

Update: 2019-08-25 18:03 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పడానికి ఏపీ మంత్రులు ఎవరూ వెళ్లకపోవడం ఆసక్తిదాయకంగా ఉంది. జగన్ కేబినెట్లో ఇరవై ఐదు మంత్రులున్నారు  వారిలో ఐదుగురు ఉపముఖ్యమంత్రులున్నారు. అయితే వారెవరూ జగన్ కు వెల్ కమ్ చెప్పడానికి వెళ్లలేదు. కేవలం ఒకే ఒకరు వెళ్లారు. ఆయనే ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి.

మిగతా వాళ్లంతా ఎవరి పనుల్లో వారున్నారు. మామూలుగా అయితే ఇలాంటి సమయాల్లో మంత్రులు హడావుడి చేస్తూ ఉంటారు. ముఖ్య నేతలు విదేశీ పర్యటనలకు వెళ్లి  తిరిగి వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పడానికి చాలా ఉబలాటపడుతూ ఉంటారు. అయితే జగన్ విషయంలో అలాంటి హడావుడి లేకపోవడం గమనార్హం.

ఇంతకీ హడావుడి చేయకూడదని మంత్రులుఎవరూ వెళ్లలేదా? లేక సమాచారం లేకనా? అనే అంశాలు చర్చనీయాంశం. జగన్ మోహన్ రెడ్డి అమెరికాకు వెళ్లింది దాదాపు వ్యక్తిగత పనుల మీద. కాబట్టి అది వ్యక్తిగత పర్యటన కాబట్టి మంత్రులు  వెల్కమ్ చెప్పడానికి హడావుడి చేస్తే అంతబాగుండదు. అందుకే మంత్రులు అటు వైపు వెళ్లకపోయుండవచ్చు కూడా.

అలాగే జగన్ ప్రయాణం కూడా సుదీర్ఘమైనది. అమెరికా పర్యటనలలో వ్యక్తిగత పనులు పూర్తి చేసుకుని ఆయన తనకు అనువైన  వేళ తిరిగి బయల్దేరినట్టుగా ఉన్నారు. దీంతో మంత్రులకు సమాచారం కూడా అంతగా అంది ఉండే అవకాశం లేదు. వ్యక్తిగత పర్యటన కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించడం కూడా అంత సబబు గా ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి సీఎం విమానాశ్రయానికి వచ్చిన వేళ పెద్దగా హడావుడి అయితే లేదు.


Tags:    

Similar News