తన మాటలతో.. పుస్తకాలతో.. పనులతో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన మనీషి మన మధ్య లేరు. సోమవారం రాత్రి 7.30 ప్రాంతంలో ఆయన మరణించిన వార్తలు వచ్చిన సమయంలో ఒక్కసారి షాక్ తగిలినట్లుగా పీలయ్యారు. తాము విన్న వార్త నిజం కాకూడదని ప్రార్థించిన వారూ ఉన్నారు.
గడిచిన మూడు రోజులుగా విషాదంలో ఉండిపోయిన భారతజాతి.. నిస్తేజం నిండిన కళ్లతో భారతరత్నం అబ్దుల్ కలాం అంత్యక్రియల్ని చూస్తుండిపోయింది. సొంతూరు (రామేశ్వరం) రైల్వేస్టేషన్ దగ్గర లో సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతాల్లో పూర్తయ్యాయి.
ఆయన పార్థిపదేహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంత్యక్రియలు మొత్తం ముస్లిం సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. అంత్యక్రియలకు ప్రధాని మోడీ.. కేంద్రమంత్రులు.. తమిళనాడు గవర్నర్ రోశయ్య.. ముఖ్యమంత్రులు చంద్రబాబు.. ఉమెన్ చాందీ.. సిద్దరామయ్య.. తమిళనాడు మంత్రి పన్నీరు సెల్వం.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. పలువురు రాజకీయ నేతలు.. శాస్త్రవేత్తలు.. కోలీవుడ్ ప్రముఖులు అంతిమ సంస్కారానికి హాజరయ్యారు.
రామేశ్వరంలోని కలాం సొంతింటి నుంచి భారీ జనసందోహం మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. నిన్నటి వరకూ మనతో తిరిగిన మనిషి రూపం.. ఇకపై మన ముందు కనిపించని పరిస్థితి. ప్రకృతిలో కలిసిన ఆయన గురుతులు మన మనసుల్లో పచ్చిగా ఉంటూ.. ఆయనిచ్చిన స్ఫూర్తితో ముందుకు అడుగులేయటం మాత్రమే మిగిలింది. మనీషి మనల్ని వదిలేసి శాశ్వితంగా వెళ్లిపోయారు.