కొత్తనోట్లు పొందడానికి అప్లికేషన్!!

Update: 2016-11-09 09:48 GMT
500 - 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో నల్ల దొంగలకు ముచ్చెమటలు పడతాయని అనుకుంటే... మరోపక్క ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులు నానా పాట్లు పడుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి జనం ఏటీఎం సెంటర్ల దగ్గర, క్యాష్ డిపాజిట్ల దగ్గర బారులు తీరారు. ఆ సంగతులు, సమస్యలూ అలా ఉంటే... పాత నోట్లు మార్చుకునేందుకు డిసెంబర్ 30 వరకూ గడువిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో పాత నోట్లను మార్చుకునే ప్రక్రియకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇదేనంటూ నెట్‌ లో ఓ ఫోటో హల్ చల్ చేస్తోంది!
 
ఈ ఫామ్ లో ఉన్న వివరాల ప్రకారం ఎవరైతే నోట్లు మార్చుకోవాలనుకుంటున్నారో వారి పేరు, బ్యాంక్ కౌంటర్ వద్ద చూపించడానికి ఒక గుర్తింపు కార్డు (ఆధార్ - డ్రైవింగ్ లైసెన్స్ - ఓటర్ ఐడీ - పాస్ పోర్ట్ - పాన్ కార్డ్ మొదలైనవి)తోసహా పాతవి 500 - 1000 నోట్లు ఎన్ని ఉన్నాయనే వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ నింపిన ఫామ్‌‌ తో పాటు పాత నోట్లను బ్యాంకులో అధికారులకు ఇస్తే తిరిగి కొత్త నోట్లను ఇస్తారట!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News