ఆంధ్రప్రదేశ్ రోడ్డురవాణ సంస్థల ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచింది. 10 శాతం మేర ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులపై మధ్య రకమైన స్థాయిలో భారం పడనుంది. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటరుకు 3 పైసలు - ఎక్స్ ప్రెస్ - డీలక్స్ సర్వీసులలో అయితే కిలోమీటరుకు 8 పైసల వంతున పెంచారు. అదే సూపర్ లగ్జరీ - గరుడ - వెన్నెల సర్వీసులలో అయితే కిలోమీటరుకు 9 పైసల వంతున చార్జీలను పెంచారు. పెరిగిన బస్ ఛార్జీలు ఈరోజు అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. పెరిగిన ఛార్జీలతో హైదరాబాద్-విజయవాడ డీలక్స్ ఛార్జీ రూ.240 నుంచి రూ.264 - ఎక్స్‌ప్రెస్ ఛార్జీ రూ.213 నుంచి రూ.235లకు పెరగనున్నాయి.
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడేందుకే ఈనిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరిస్తోంది. సంస్థ రూ.600 కోట్ల నష్టంలో ఉందని, ఈ నష్టంతో రూ.300 కోట్ల నష్టం భర్తీ అవుతుందని తెలిపింది. గత కొద్దికాలంగా చార్జీల పెంపు విషయం చర్చల్లో ఉండగా...తాజాగా అమలులోకి వచ్చింది.