లీటర్ వాటిల్ బాటిల్ ధర ఎంత ఉంటుంది? మామూలుగా అయితే రూ.20. కానీ.. ఖరీదైనదంటే రూ.100. కాదంటే నాలుగైదు వేల వరకు కూడా ఉంటాయని తెలిసిందే. కానీ.. ఇప్పుడు చెప్పే వాటర్ బాటిల్ వ్యవహారం అందుకు మించింది. ఆ మాటకు వస్తే.. లీటర్ కంటే తక్కువ.. మరింత సరిగ్గా చెప్పాలంటే అక్షరాల 750 మిల్లీ లీటర్లు మాత్రమే. కానీ.. ఈ వాటర్ బాటిల్ కొనుగోలు చేయాలంటే సామాన్యులు.. మధ్య తరగతుల వారు తమ జీవితకాలపు ఆస్తుల్ని అమ్మాల్సిందే. అవును.. సదరు వాటర్ బాటిల్ రేటు జస్ట్ రూ.45 లక్షలు మాత్రమే.
సీఈవోల జీతాలకు సరిసమానంగా ఉండే ఈ వాటర్ బాటిల్ ఉండే నీళ్లల్లో ఏముంటుంది? ఎందుకింత ఖరీదు అంటే.. దాని గురించి బోలెడన్ని విశేషాల్ని చెబుతుంటారు. ఇంతకీ ఈ లక్షలు చేసే నీళ్ల బాటిల్ పేరేమిటంటే.. 'అక్వా డిక్రిస్టలో ట్రిబ్యుటొ ఎ మోడి్గ్లియాని' గా పిలుస్తారు. ఇందులో ఉండే నీళ్లు ఇంతకు ముందు చెప్పినట్లు 750మి.లీ. మాత్రమే ఉంటాయి. ఈ నీటిని ఫ్రాన్స్.. ఫిజీలలోని సహజ నీటి బుగ్గల నుంచి సేకరిస్తారని చెబుతారు. అంత మాత్రానికే అంత రేటా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఈ బాటిల్ తయారీని రోటీన్ కు భిన్నంగా తయారుచేస్తారని చెబుతున్నారు.
ఈ వాటర్ బాటిల్ లోపలి భాగాన్ని 24 క్యారెట్ల బంగారంతో తయారు చేయటం ఒక విశేషం అయితే.. ఈ బాటిల్ షేప్ ను ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన బాటిల్ డిజైనరల్ ఫెర్నాండో అల్టామిరానో డిజైన్ చేశాడు. ఈ బాటిల్ లో ఉండే నీళ్లు ప్రత్యేకమైన రుచితో ఉంటాయి. మార్కెట్లో లభించే యావరేజ్ వాటర్ కంటే ఎక్కువ శక్తిని అందిస్తుందట. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ.. ఇంత డబ్బులు పోసి ఎవడు కొంటాడండి.. ఈ వాటర్ ను అంటే.. బోలెడంత మంది సెలబ్రిటీలు.. సంపన్నులు దీన్ని కొనేందుకు ఆసక్తిని చూపిస్తారని చెబుతున్నారు. ఒక బాటిల్ కొనే ఖర్చుతో.. ఒకడి జీవితం శాశ్వితంగా బాగుపడిపోవటం ఖాయం కదూ? సంపన్నులకు అలాంటి ఆలోచనలు ఎందుకు రావో?