ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ఇరకాటం ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో అక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటును ఆ ప్రాంత ప్రజలు నిరసిస్తున్నప్పటికీ ప్రభుత్వం ముందుకు పోతోందనే భావన వ్యక్తమవుతోంది. ఇటీవలే తుందుర్రు పోరాట కమిటీ నాయకులతో పాటు పది గ్రామాల ప్రజలు సీఎం చంద్రబాబును అమరావతిలో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తలెత్తుతున్న సమస్యలను వివరించారు. మూడున్నరేళ్లుగా ఉద్యమం చేస్తున్నామని, ఫుడ్ పార్కు తమ ప్రాంతంలో వద్దని వేరే చోటుకు తరలించాలని కోరారు. ఆక్వాఫుడ్ పార్కు వల్ల డ్రైన్లు కలుషితమవుతాయని, 40వేల టన్నుల ఆక్వా ప్రాసెసింగ్ సామర్ధ్యం కలిగిన ఈ పరిశ్రమ వల్ల వేలాది మంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆక్వాపుడ్ ఫార్కు మినహా ఇతర ఏ పరిశ్రమలు ఏర్పాటు చేసినా తమకు ఇబ్బంది లేదన్నారు. అయితే వీరికి ముఖ్యమంత్రి నుంచి సరైన హామీ దక్కలేదని సమాచారం. సీఎం నిర్ణయం తుందుర్రు ప్రజలకు అమోదయోగ్యం కాకపోవడంతో బయటికి వచ్చి నిరసన తెలిపారు.
అయితే ఈ ఎపిసోడ్ లోకి తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారు. బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా రైతుల ప్రతినిధుల బృందం రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసింది. జిల్లా ఆక్వాపార్క్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు మద్దతు ఇవ్వాలని రైతు ప్రతినిధులు రాహుల్‌ను కోరారు. వారి ఆవేదనను విన్న రాహుల్‌గాంధీ తన మద్దతు ఉంటుందని తెలిపినట్లు సమాచారం. అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో తుందుర్ర పోరాటం కొత్త రూపం దాల్చుతోందని తెలుస్తోంది.
అక్వాఫుడ్ పార్క్ నిర్మాణం జరిగితే ఫ్యాక్టరీ నుంచి విష రసాయనాలు వచ్చి పంట కాలువలు, పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఫలితం లేకపోవడంతో స్థానికులు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రధాన పార్టీలైన జనసేన, సీపీఎంలకు తమ ఆవేదనను విన్నవించుకున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బాధితులు సమావేశమయ్యారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకు పోవద్దని సూచించారు. తుందుర్రు వద్ద అక్వాఫుడ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ 30 గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. కొద్దికాలం క్రితం ఆ గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.144 సెక్షన్ విధించారు. అక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం స్థానిక పరిధి నుంచి జాతీయ స్థాయికి చేరడం ఆందోళన హీట్‌ను పెంచింది.