నరేంద్రమోడీ ప్రభుత్వంపై పోరాటానికి మరేది అంశంలేనట్లు ఈవీఎంల దుర్వినియోగం అవుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పైగా ఈవీఎంల దుర్వినియోగంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని కూడా ఓ పదిపార్టీలు తీర్మానం కూడా చేశాయి. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, ఆర్జేడీ, బీఎస్పీ, సమాజ్ వాదీపార్టీ, ఆర్ఎల్డీ, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ఇండియా, స్వరాజ్ పార్టీల ప్రతినిధులు ఢిల్లీలో సమావేశమై తీర్మానంచేశారు.
మెషీన్, మనీ, మీడియా అనే మూడు ఎంలను అడ్డంపెట్టుకుని కేంద్రప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తీరని అన్యాయంచేస్తోందంటు మండిపడ్డాయి. ఈవీఎంల వినియోగం, వీవీప్యాట్ల ఓట్ల లెక్కింపు ప్రజాస్యామ్య సూత్రాలకు అనుగుణంగా లేదని 11 పార్టీలు అభిప్రాయపడ్డాయి. ప్రతి ఓటరు తాము ఓటువేశామో లేదో ధృవీకరించుకునేందుకు ఓ విధానం ఉండాలని తీర్మానం చేశాయి. ఓటింగ్ ప్రక్రియను ధృవీకరించటానికి లేదా ఆడిట్ చేయటానికి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ లను పనిచేసే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రతీపార్టీ ఈవీఎంల వినియోగంపై వంద సందేహాలను లేవనెత్తుతునే ఉంటాయి. మళ్ళీ అదే ప్రతిపక్షం అధికారంలోకి వస్తే ఈవీఎంల వినియోగంపై నోరిప్పదు. ఈవీంఎంలో ఓటింగ్ జరిగిన వెంటనే తాను ఎవరికి ఓటు వేశామో తెలుసుకునేందుకే వీవీప్యాట్ లో ఒక స్లిప్పు కొద్ది సెకన్లపాటు డిస్ ప్లే అవుతుంది. అంటే తాను ఏ అభ్యర్ధికైతే ఓటువేశాడో అదే అభ్యర్ధికి ఓటుపడిందా లేదా అని ధృవీకరించుకోవచ్చు.
ఈ ప్రక్రియలో ఏమన్నా అనుమానాలున్నా, అభ్యంతరాలున్నా వెంటనే ఎన్నికల అధికారికి చెప్పవచ్చు. ఇదే కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీలు అధికారంలో ఉన్నపుడు కూడా ఇవే ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయి. ఇపుడున్న ప్రక్రియకన్నా మరింత మెరుగైన విధానం అమలుచేయాలని పార్టీలు అడగటంలో తప్పులేదు. అంతేకానీ హోలుమొత్తంమీద ఈవీఎంల ప్రక్రియపైనే నమ్మకంలేదన్నట్లుగా మాట్లాడటంలో అర్ధంలేదు. ఇక మనీ, మీడియా బలమంటే ఎవరికి ఎంత శక్తుంటే అంత అడ్వాంటేజ్ తీసుకోవటం అందరు చూస్తున్నదే.