దక్షిణాఫ్రికా .. నిత్యం ప్రశాంతంగా ఉండే ఆ దేశం ప్రస్తుతం అట్టుడుకుతోంది, అల్లరి మూకలు దుకాణాలపై పడి దోచుకుపోయారు. మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు జైలు శిక్ష విధించటంతో ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తున్నారు. నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా స్ఫూర్తితో దక్షిణాఫ్రికా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, ఆ తర్వాత దేశాధ్యక్షుడైన జాకబ్ జుమా ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జాకబ్ జుమా అవినీతి భాగోతాలు బయటపడటంతో పదవిని పోగొట్టుకొని జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
జాకబ్ అవినీతి మరకలు, జైలు జీవితం వెనుక ఆ దేశంలో స్థిరపడిన ముగ్గురు గుప్తా బ్రదర్స్ ఉన్నారు. ఆ దేశ సంక్షోభానికి మన భారతీయ అన్నదమ్ములు (గుప్తా బ్రదర్స్) ముగ్గురి కీలక పాత్ర ఎంతో ఆసక్తికరం , రాజకీయం, అవినీతి అంటకాగితే వ్యక్తులకు, వ్యవస్థలకు ఏమౌతుందనటానికి ఈ జుమా-గుప్తాల జుగల్‌బందే నిదర్శనం.
అసలు ఎవరు ఈ గుప్తా బ్రదర్స్
శివకుమార్ గుప్తా... ఉత్తర్‌ప్రదేశ్ లోని మారుమూల సహరన్ పుర్ లో ఓ చిన్న రేషన్ షాపు డీలర్. కానీ ఆయన ఆశలన్నీ ఆకాశంలోనే ఉండేవి. ఆయన కుమారులు అజయ్, అతుల్, రాజేశ్, 1990ల ఆరంభంలో అజయ్ దిల్లీలో కంప్యూటర్ పరికరాల దిగుమతి వ్యాపారం మొదలెట్టాడు. రెండో అబ్బాయి అతుల్ 1993లో దక్షిణాఫ్రికా వెళ్లి, ఓ చెప్పుల దుకాణం పెట్టుకున్నాడు. అది మొదలు ఆ కుటుంబం దశ తిరగటం మొదలైంది. జొహెన్నస్ బర్గ్ లో చెప్పుల దుకాణంతో మొదలైన అతుల్, కంప్యూటర్ పరికరాలను తీసుకొచ్చి అసెంబ్లింగ్ చేసి అమ్మటం మొదలెట్టి సంపాదించసాగాడు. ఆ క్రమంలో మెల్లగా మండేలా పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) నేతలతో సంబంధాలు మొదలయ్యాయి.
ఓసారి భారత్ కు వచ్చినప్పుడు, మండేలా డిప్యూటీ థాబో ఎంబెకీ సహచరుడు ఎసోప్ పహాద్ తో పరిచయమైంది. ఆ పరిచయంతో గుప్తా కుటుంబం దక్షిణాఫ్రికాను దున్నటానికి బీజాలు పడ్డాయి. దక్షిణాఫ్రికాకు స్వాతంత్య్రం వచ్చినా, ఆర్థిక వ్యవస్థ అంతా ఇంకా తెల్లజాతి వ్యాపారస్థుల చేతుల్లోనే ఉండేది. దాంతో నల్లజాతి నేతలు భారత్, చైనాలాంటి దేశాలతో సంబంధాలు పెంచుకోవటానికి ఇష్టపడ్డారు. దీన్ని గుప్తా బ్రదర్స్ అవకాశంగా వాడుకున్నారు. ఎంబెకి అధ్యక్షుడయ్యాక పహాద్ ద్వారా అజయ్ గుప్తా దగ్గరయ్యారు. ప్రభుత్వ కాంట్రాక్టులు మొదలయ్యాయి. వాటిలో వాటాలు రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు వెళ్లేవి. చిన్నచిన్న కాంట్రాక్టులతో మొదలైన వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లి యురేనియం గనుల్లోకి ప్రవేశించింది. అధ్యక్షుడి ఇంట్లో పార్టీకి గుప్తా బ్రదర్స్ ఉండాల్సిందే.
ఒకవంక ఎంబెకీతో చనువుగా ఉంటూనే ఆయన ప్రత్యర్థి పార్టీలో నెంబర్-2 జుమాతోనూ గుప్తా బ్రదర్స్ సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. జుమా అధ్యక్షుడిగా అధికారం చేపట్టగానే గుప్తాల ప్రాభవం పెరిగిపోయింది. జుమాతో పాటు ఏఎన్‌సీ సీనియర్ నేతల కొడుకులను కూడా తమ వ్యాపారాల్లో భాగస్వాములను చేశారు. కాంట్రాక్టులు, వ్యాపారాల నుంచి ఏకంగా కేబినెట్‌లో ఎవరుండాలో ఎవరు వద్దో నిర్ణయించే స్థాయికి గుప్తా బ్రదర్స్ ఎదిగిపోయారు. అధ్యక్ష భవనం దాదాపు వీరి చేతుల్లోకి వచ్చేసింది. 2015లో గుప్తాలు చెప్పిన మనిషిని ఎలాంటి అనుభవం లేకున్నా ఆర్థిక మంత్రిని చేశారు జుమా, ఇలా గుప్తా బ్రదర్స్ అవినీతికి జుమా రాజకీయం తోడై దక్షిణాఫ్రికా ఆర్థిక స్థితి దారుణంగా తయారైంది. ఇది జుమా పదవికి ఎసరు తెచ్చింది.
పార్టీలో జుమా పరిస్థితి బలహీనపడటంతోనే గుప్తా బ్రదర్స్ కు కూడా కష్టకాలం మొదలైంది. అదే సమయంలో ఓ మిలటరీ బేస్ వద్ద తమ కుటుంబ వివాహ వేడుక ఒకటి ఘనంగా నిర్వహించారు వారు. ఈ వేడుకకు భారత్ నుంచి విమానాల్లో బంధుమిత్రుల్ని తీసుకొచ్చి కన్నుగుట్టేలా అంగరంగ వైభోగంగా చేశారు. అక్కడి నుంచి వారి పతనం మొదలైంది. దేశంలోని పౌర సంఘాలు, విపక్షాలు, మీడియా గుప్తా బ్రదర్స్ అవినీతిని, జుమా తప్పులను ఎత్తిచూపటం మొదలెట్టాయి. గుప్తా బ్రదర్స్ నుంచి బ్యాంకులు దూరం జరిగాయి. అవినీతి వ్యతిరేక వ్యవస్థలు వెంటపడ్డాయి. జొహెన్నస్ బర్గ్ స్టాక్ ఎక్సేంజీ నుంచి గుప్తా బ్రదర్స్ కంపెనీలను డీలిస్ట్ చేశారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితి. రాజకీయంగా తన పరిస్థితి బాలేదని గుర్తించిన జుమా దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వెంటనే ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు గుప్తా బ్రదర్స్ కంపెనీలపై దాడులు చేశాయి. కానీ కొద్దిరోజుల ముందే అన్నీ సర్దుకొని గుప్తా బ్రదర్స్ దుబాయ్ విమానమెక్కేశారు. వారితో కలసి అవినీతికి పాల్పడ్డందుకుగాను మాజీ అధ్యక్షుడు జుమా జైలు శిక్షనెదుర్కొంటున్నారు, అదీ... జుమా-గుప్తాల జుప్తా కథ.