ట్విట్టర్ ఇండియా ఎండి మనీష్ మహేశ్వరి భలే కండీషన్లు పెట్టారు. తాను లొంగిపోవాలంటే తనను అరెస్టు చేయకూడదని, కొట్టకూడదని ఏకంగా హైకోర్టుకే షరతులు పెట్టడమే విచిత్రంగా ఉంది. నిబంధనల అమలు విషయంలో ట్విట్టర్ కు కేంద్రప్రభుత్వానికి మధ్య పెద్ద వివాదమే నడుస్తున్న విషయం తెలిసిందే. భారత్ లో ఉండాలనుంటే కేంద్రం చెప్పిన నిబంధనలను పాటించాల్సిందే అని కేంద్రం తేల్చిచెప్పింది.
అయితే కేంద్రం రూపొందించిన నిబంధనలకన్నా తమ సొంత నిబంధనలనే తాము పాటిస్తామని వాదిస్తోంది. ట్విట్టర్ వ్వహారం ఎలాగుందంటే ‘పిల్లి గుడ్డిదైతే ఎలుక డ్యాన్స్ చేసింద’నే సామెతలాగ తయారైంది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ గొడవకు సంబంధించి యూపీ పోలీసులు ట్విట్టర్ ఎండికి నోటీసులిచ్చింది. అయితే ఆ నోటీసులకు సమాధానంగా తాను వర్చువల్ విచారణకు హాజరవుతానని చెప్పారు.
దీనికి పోలీసులు అంగీకరించకపోవటంతో కర్నాటక హైకోర్టులో పిటీషవన్ వేశారు. తనను అరెస్టు చేయకూడదట, కొట్ట కూడదనే షరతు విధించారు. తన షరతులకు అనుకూలంగా కోర్టు పోలీసులను ఆదేశిస్తేనే తాను లొంగుతానని చెప్పారు. లేకపోతే లొంగను అనే అర్ధం వచ్చేట్లుగా కోర్టులో పిటీషన్ వేయటమే విచిత్రంగా ఉంది. మరి మహేశ్వరి షరతులతో కూడిన పిటీషన్ పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
గతంలో ఏం జరిగిందంటే..
ట్విట్టర్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది సజన్ పూవయ్య, తాత్కాలిక ఫిర్యాదు అధికారిని నియమించినట్లు కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత ఆ విషయంపై సమర్పించిన అఫిడవిట్ ను ఆయన వెనక్కు తీసుకోవడం గమనార్హం.
"మీ ప్రక్రియకు ఎంత సమయం పడుతుంది? ట్విట్టర్ మన దేశంలో కోరుకున్నంత సమయం పడుతుందని భావిస్తే, నేను దానిని అనుమతించను" అని ధర్మాసనం చాలా సీరియస్ గా తేల్చింది. కొత్త నియామకంపై సూచనలు తీసుకోవడానికి పూవయ్య సమయం కోరగా కోర్టు అనుమతించింది. కానీ ఇంతవరకు ఎవరినీ నియమించలేదు. తదుపరి విచారణ కోసం కోర్టు ఈ విషయాన్ని గురువారానికి వాయిదా వేయగా... విచిత్రమైన సమాధానాలతో కోర్టుకే కండిషన్లు పెట్టారు ట్విట్టర్ ప్రతినిధులు.