ప్రతిఏటా గణతంత్ర దినోత్సవం నాడు ఆర్భాటంగా జరిపే కవాతులో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఏటా ఈ కవాతులో ఒంటెల బృందం పాల్గొంటుంది. అయితే.. ఈసారి ఒంటెల బృందానికి కవాతులో పాల్గొనే అవకాశం దక్కటం లేదు. 1950లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఒంటెల బృందం తొలిసారి పాల్గొంది. అప్పటి నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఒంటెల ప్రదర్శన ఉంటుంది.
అయితే.. ఈసారి ఒంటెల ప్రదర్శనను గణతంత్ర వేడుకల నుంచి తప్పించారు. వాటి స్థానే.. శిక్షణ పొందిన కుక్కలకు అవకాశం కల్పిస్తున్నారు. దాదాపు 66 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒంటెల ప్రదర్శన స్థానే ఈ ఏడాది కుక్కల ప్రదర్శనను నిర్వహించనున్నారు. ఒంటెలతో పాటు.. ఈసారి వేడుకల్లో ఐటీబీపీ.. సీఐఎస్ ఎఫ్.. ఎస్ ఎస్ బీ లాంటి పారామిలటరీ బృందాలు కూడా వేడుకల్లో పాల్గొనకపోవటం గమనార్హం.