అమిత్ షా ఇలా బిల్లు పెట్టారో లేదో.. రాష్ట్రపతి నుంచి అలా గెజిట్ నోటిఫికేషన్

Update: 2019-08-05 06:55 GMT
రాజ్యసభలో జమ్మూ కశ్మీర్‌ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు భారత హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌ పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే ఉండనున్నాయి. కశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి రానున్నాయి. ఇకపై పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూ కశ్మీర్‌ లోనూ అమలు కానుంది.

జమ్మూ కశ్మీర్ విభజన

జమ్ముకశ్మీర్ విభజనకూ అమిత్ షా బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం... అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ - చట్ట సభలున్న కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్ము - కశ్మీర్‌ లను విభజించనున్నారు. అంటే... జమ్ముకశ్మీర్‌ ను మూడు భాగాలుగా విభజించనున్నారు.

కాగా.. ‘జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని లద్దాఖ్ ప్రాంతం ప్రజలు ఎంతో కాలంగా కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇవ్వాలని కోరుతున్నారు. వారి ప్రయోజనాలు నెరవేర్చేందుకు చట్టసభ లేని లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటవుతుంది. అంతర్గత భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని - జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలో సీమాంతర ఉగ్రవాదం నేపథ్యంలోను జమ్మూ మరియు కశ్మీర్‌ కు చట్టసభ కలిగిన ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటవుతుంది.’ అని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పారు.

జమ్మూ కశ్మీర్‌ కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Tags:    

Similar News