ప్రధాని మోడీ నోట్ల రద్ధు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే అధికశాతం మంది ప్రజలు ఆ నిర్ణయాన్ని స్వాగతించారు, మద్దతు పలికారు. ఆ నిర్ణయం వల్ల రెండు మూడు రోజులు ఇబ్బంది పడటానికి ఎవరికి వారే మానసికంగానూ, శారీరకంగానూ సిద్ధపడ్డారు. మోడీ నిర్ణయం సూపర్ అంటూ కామెంట్స్ విసిరారు. అయితే మోడీ చెప్పింది వేరు సామాన్యుడు అనుభవించింది వేరు. రెండు మూడు నాలుగు రోజులు కాదు నెల దాటినా కూడా సామాన్యుడికి కరెన్సీ కష్టాలు తీరలేదు. దీంతో ఏ సామాన్యుడు - ఎంతమంది ప్రజలైతే నవంబరు 8 ప్రకటన అనంతరం మోడీకి మద్దతు పలికారో వారంతా పెదవి విరవడం మొదలుపెట్టారు. దీనంతటికీ కారణం ఒకటే... అదేమిటంటే బ్యాంకుల్లో డబ్బు లేకపోవడం. అయితే ఈ విషయాలపై క్లారిటీ ఇస్తున్నారు అరుణ్ జైట్లీ. నేరం మాది కాదు అనే సంకేతాలూ ఇస్తున్నారు.
తాజాగా నోట్ల రద్దు - నగదు నిల్వలు వంటి విషయాలపై స్పందించిన ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ... డిసెంబరు 30 తర్వాత కరెన్సీ ఇబ్బందులు తలెత్తకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తగినంత కరెన్సీ ఉందని చెలిపారు. ఆర్బీఐ చెస్టుల్లో సరిపడా నగదు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. అనంతరం... ఆర్బీఐ ఎప్పుడూ పూర్తి సన్నద్దతతోనే ఉండేది.. నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు తగినంత కరెన్సీ ని విడుదల చేయని రోజంటూ లేదు అని అన్నారు. సరిగ్గా గమనిస్తే... ఈ మాటకు అర్ధం ఏమిటనేది ఇట్టే అర్ధమైపోతుంది. కేంద్రం తప్పులేకుండా ఆర్బీఐ నుంచి బ్యాంకులకు ప్రతిరోజూ సరిపడా నగదు పంపుతున్నాము అన్నారు... సామాన్యుడేమో క్యూలో గంటలు గంటలు నిలబడి చివరికి "నో క్యాష్" బోర్డు చూసి వెళ్లిపోతున్నాడు. అంటే... ఆర్బీఐ కి సమాన్యుడి మధ్యలో ఉన్నది ఇంకెవరు బ్యాంకులే కదా!! అంటే... సమస్య అంతా బ్యాంకుల వద్దే ఉందని, ఈ సమస్యలకు కారణం బ్యాంకులని జైట్లీ చెప్పారని భావించొచ్చు. ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చిన జైట్లీ.. బ్యాంకుల కార్యకలాపాలపై ఈడీ - సీబీఐలు నిఘా కొనసాగిస్తున్నాయని, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే సూచించినట్లు తెలిపారు. ఏది ఏమైనా... నేరం మాది కాదు బ్యాంకులది అని ఇప్పటికే ఒక కారణం రెడీ చేసుకుంటున్నట్లుంది కేంద్రం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/