బీహార్ ఎన్నికలకు ముందు దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ వరుసబెట్టి అవార్డులు వెనక్కు ఇచ్చిన మెడీ తీరుపై మండిపడ్డ సాహితివేత్తలు - శాస్త్రవేత్తలు - కళాకారులు ఇపుడు హఠాత్తుగా అలాంటి విషయాలను మర్చిపోవడం ఆసక్తిని కలిగించే అంశమే. అయితే బీహార్ ఫలితాల తర్వాత ఒక్కసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై మాటల దాడి చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఈ రేసులో బీజేపీ సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌శౌరీ చేరిపోయారు. అయితే ఆయన కొత్త పాయింట్ తో తెరమీదకు వచ్చారు.
మోడీ అనుయాయులు అనుసరిస్తున్న విభజన రాజకీయాల వల్లే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందంటూ ఫలితాల అనంతరం శౌరీ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మోడీ విధానాలను కాంగ్రెస్+ఆవుగా శౌరీ విశ్లేషించారు. అయితే తన అభిప్రాయాలను తాను వ్యక్తీకరించిన తర్వాత ప్రధాని మోడీ అనుయాయులు తననూ, తన కుమారుడినీ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారంటూ శౌరీ ఆరోపించారు. మోడీ అనుచరులు తనపైనే కాకుండా, మానసిక వైకల్యమున్న తన కుమారుడిపైనా సామాజిక మాధ్యమాల ద్వారా దూషణలకు దిగుతున్నారంటూ అరుణ్ శౌరీ మండిపడ్డారు. సెరెబ్రల్ పాల్సీతో బాధపడే శౌరీ కుమారుడు మానసిక వికలాంగుడు. ఆయన కుమా రుడి పరిస్థితి పట్ల ఎవరికైనా సానుభూతి ఉండటం సహజం. అందుకు భిన్నంగా..ఆయన కుమారుడో పిచ్చోడు, ఆయనకు మరింత పిచ్చి అంటూ మోడీ అనుయాయులు విమర్శలు చేస్తున్నారని శౌరీ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
వాజ్‌పేయి హాయంలో కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ శాఖామంత్రిగా అరుణ్ శౌరి పనిచేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన శౌరీని పెద్దగా గుర్తించిన దాఖలాలు లేవు. మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపైనా గతంలో విమర్శలు చేసిన శౌరీ మోడీ పాలనా తీరుపై ఇటీవల విమర్శలు చేశారు.