వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం అమలు తీరును నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న జవాన్ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికోద్యోగి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నున పోలీసులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలోనికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన ఆయన వాహనాన్ని ఆసుపత్రి ఆవరణలోనికి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. వాహనాన్ని పోలీసులు చుట్టుముట్టి అరవింద్ కేజ్రివాల్ తో పాటుగా ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సైతం అరెస్టు చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఘాటుగా స్పందించారు.
మాజీ జవాన్ ఆత్మహత్య దురదృష్టకరమని పేర్కొన్న మమతా...మరణించిన జవాను కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ - ఉప ముఖ్యమంత్రి సిసోడియాలను పోలీసులు అదుపులోనికి తీసుకోవడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు సరైన సంప్రదాయం కాదని ఢిల్లీ పోలీసుల తీరును తప్పుపట్టా. మాజీ జవాను కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించేందుకు వారిని అనుమతించాలని - తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిథి కూడా వారిని కలుసుకోనున్నారని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. దీనిపై పోలీసు వర్గాలు స్పందిస్తూ ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో జనం ఉన్నారనీ, వారి నినాదాలు - అలజడి వల్ల వైద్య సేవలు కొనసాగించడం కష్టంగా ఉందన్న రాత పూర్వక ఫిర్యాదు అందిందని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ ఫిర్యాదు మేరకే తాము వ్యవహరించామని స్పష్టం చేశారు.
మాజీ జవాన్ ఆత్మహత్య సంఘటనను రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి వీకేసింగ్ అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ ఆయన మాజీ జవాన్ రామ్ కిషన్ గారెహ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయనీ, అయితే ఒఆర్ ఒపికి - ఆయన ఆత్మహత్యకు సంబంధం ఉందా అన్న విషయంపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని వీకేసింగ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయడం రాహుల్ గాంధీకి తగదని ట్వీట్ లో పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/