అంబానీ మీదన ‘సామాన్యుడి’ డైరెక్ట్ అటాక్

Update: 2016-06-15 04:43 GMT
ఏదైనా సరే ఢిల్లీ ముఖ్యమంత్రి తీరే కాస్త సపరేటు అన్నట్లుగా చెప్పొచ్చు. విమర్శలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించటం ఆయనకు అస్సలు అలవాటు ఉన్నట్లు కనిపించదు. ఎంతటి వారినైనా సరే.. ఆయనకు చిరాకు పుడితే చాలు.. ఓపెన్ గా విమర్శించేస్తారన్నట్లుగా ఉంది ఆయన తీరు. తాజాగా ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై తీవ్ర వ్యాఖ్యలుచేశారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇష్టపడని రీతిలో ఆయన విమర్శలు సంధించటం గమనార్హం.

కరెంటు ఛార్జీలు తగ్గకుండా ఉండేందుకు అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ లంచాలు ఇచ్చినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీ నేతృత్వంలో నడిచే బీఎస్ ఈఎస్ పని తీరు దారుణంగా ఉందన్న కేజ్రీవాల్.. దీనిపై మాట్లాడేందుకు రావాలంటూ అనిల్ అంబానీని పిలిపించటం గమనార్హం. ఇంతకీ ఢిల్లీ ముఖ్యమంత్రికి.. అనిల్ అంబానీకి మధ్యనున్న లడాయి ఎందుకంటే.. ఢిల్లీలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో అనిల్ అంబానీకి చెందిన బీఎస్ఈఎస్ సంస్థ ఒకటి.

ఇక.. ఎన్నికల హామీల్లో భాగంగా విద్యుత్ ఛార్జీల ధరల్ని తగ్గిస్తామని సామాన్యుడి పార్టీ అయిన ఆమ్ ఆద్మీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఇప్పుడు అందుకు తగ్గట్లుగా విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించాలంటూ.. విద్యుత్ పంపిణీ సంస్థల ధరలు తగ్గాలి.కానీ.. వాటిని తగ్గించేందుకు అనిల్ అంబానీ కంపెనీ సిద్ధంగా లేకపోవటంతో.. ఆయనపై సామాన్యుడు డైరెక్ట్ ఎటాక్ కు రెఢీ అయిపోయారు. దేశంలోనే అత్యంత బలమైన పారిశ్రామికవేత్తతో కేజ్రీవాల్ ఫైటింగ్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
Tags:    

Similar News