కరోనా పై యుద్ధం - కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

Update: 2020-04-14 14:30 GMT
కరోనా కేసులను వెతికి వెతికి పట్టుకుని చికిత్స ఇవ్వకపోతే భారతదేశం దీని బారి నుంచి తప్పించుకోవడం చాలా చాలా కష్టం. కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో సక్సెస్ ఫుల్ గా ముందుకు పోతున్నాయి. కేరళ ఇప్పటికే దీనిని అరికట్టడంలో ఓ మోడల్ గా నిలవగా - ఏపీ - తెలంగాణ - ఒడిసా రాష్ట్రాలు కూడా బీభత్సంగా పోరాడుతున్నాయి. కేజ్రీవాల్ అయితే ఏకంగా దీనిపై పెద్ద యుద్ధం ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఎలా వాడవాడను కవర్ చేస్తామో అలా కరోనా విషయంలో డీల్ చేయాలని కేజ్రీవాల్ ప్లాన్ చేశారు. ఇందుకోసం 14 వేల మందితో ‘వారియర్ టీమ్స్‘ ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. సంచలనం ఏంటంటే... ఇప్పటికే నియమాకాలు కూడా పూర్తయ్యాయి. ఈరాత్రి నుంచే ఈ బృందాలు పనిచేస్తాయి.

ఈ టీంలో ఎవరుంటారు?

ఈ ’కరోనా ఫుట్ వారియర్‘ టీంలో ఒక్కో దాంట్లో 5 మంది ఉంటారు. ఈ ఐదుగురు దాదాపు స్థానికులే ఉంటారు. లేదా స్థానికంగా పనిచేస్తున్న వారు ఉంటారు. దీనివల్ల ఇళ్లను గుర్తించడం సులువుగా ఉంటుంది. ప్ర‌తి బృందంలో ఓ  కానిస్టేబుల్ - శానిటేషన్ వర్కర్ - సివిల్ డిఫెన్స్ వాలంటీర్ - ఆశా హెల్త్ వర్కర్ - అంగన్ వాడీ వర్కర్ ఉంటారు. ఈ బృందం పోలింగ్ బూత్ ఆధారంగా పనిచేస్తుంది. వీరిని ఓ బూత్ లెవల్ ఆఫీసరు పర్యవేక్షిస్తారు.   వీరు కాకుండా  వీళ్లలో చాలా మంది స్థానికులే ఉంటారు. మంగళవారం అర్థరాత్రి నుంచి ఈ టీమ్స్ రంగంలోకి దిగుతాయి. దేశంలోనే ఇలా ప్రతి ఇంటిని పర్యవేక్షించే బృందాలు ఏర్పాటుచేసింది తామే అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.

వీరు ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం - అనుమానితులను గుర్తించడం - వైద్య సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు నిర్బంధ జోన్లలో ఇంటికి నిత్యావసరాలు అందించడంలో కూడా సాయపడతారు. వీరిని ఎంపిక చేసేముందే అందరికీ ఫిట్ నెస్ పరీక్షలు చేశారు. ప్రతి ఇంట్లో పక్కింటి కేసులను కూడా క్రాస్ వెరిఫై చేస్తారు. ఈ బృందాలు ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తమ నివేదిక అందజేస్తాయి. ఐఏఎస్ అధికారి సంజయ్ గోయెల్ ఈ 14 వేల మందికి ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తారు. ఈయనతో ఢిల్లీ ప్రధాన కార్యదర్శి టచ్ లో ఉంటారు.
   

Tags:    

Similar News