కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. అందుకు ముకుతాడు వేసేందుకు ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీకి వచ్చే వారంతా తప్పనిసరిగా హోం క్వారంటైన్ అని తేల్చేసింది. ఢిల్లీకి వచ్చే వారు ఎవరైనా సరే.. వారికి మాయదారి రోగ లక్షణాలు ఉన్నా లేకున్నా సంబంధం లేకుండా హోం క్వారంటైన్ చేయాల్సిందేనని తేల్చింది. ఇందుకు సంబంధించిన ఆదేశాల్ని జారీ చేసింది.
ఇప్పటివరకూ ఢిల్లీకి వచ్చే వారిలో మాయదారి రోగ లక్షణాలు కనిపిస్తే.. వారిని పద్నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్ కు తరలించేవారు. ఇప్పుడు ఎలాంటి రోగ లక్షణాలు లేని ప్రయాణికులు సైతం తప్పని సరిగా ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ చేయాల్సిందేనని కేజ్రీ సర్కారు చెబుతోంది. ఈ కొత్త విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రంలోని కలెక్టర్లకు చెప్పింది.
ఢిల్లీ సర్కారు నిర్ణయం ఇలా ఉంటే.. కొన్ని రాష్ట్రాలు హోంక్వారంటైన్ ను తగ్గించేస్తే.. మరికొన్ని రాష్ట్రాలు పెంచేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకూ కర్ణాటకలో పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ విధించే వారు. దాని స్థానే ఏడు రోజులకు తగ్గించారు. అదే సమయంలో ఉత్తరాఖండ్ లో మాత్రం మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఇప్పటివరకున్న 14 రోజుల క్వారంటైన్ కు బదులుగా 21 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఎలాంటి క్వారంటైన్ లేదు. అదే సమయంలో ఏపీకి వెళ్లే వారంతా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. పెద్ద వయస్కులు.. గర్భిణులు.. ఇతర జబ్బులతో ఇబ్బంది పడేవారు మినహా.. మిగిలిన వారంతా హోం క్వారంటైన్ కానీ.. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ క్వారంటైన్ కు విధించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇలా.. ఒక్కోరాష్ట్రం ఒక్కోలా వ్యవహరించటం కనిపిస్తుంది.