పరీక్షలో కేజ్రీవాల్ నెగ్గుతారా ?

Update: 2022-02-13 12:30 GMT
రాబోయే ఎన్నికలు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు పెద్ద పరీక్షనే చెప్పాలి. కేజ్రీవాల్ కు పరీక్ష ఏమిటంటే ఆప్ కు నిజంగానే జాతీయ పార్టీ హోదా దక్కాలంటే ఈ ఎన్నికలే నిజమైన పరీక్ష. ఓట్లు లేదా సీట్ల విషయంలో కేంద్ర ఎన్నికల కమీషన్ నిబంధనలను గనుక ఆప్ సాధిస్తే పార్టీకి జాతీయ హోదా దక్కినట్లే. లేకపోతే టీడీపీ, వైసీపీలు జాతీయపార్టీలని లెటర్ హెడ్లలో చెప్పుకుంటున్నట్లు చెప్పుకోవాలంతే.

ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ను వదిలేస్తే పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ లో మంచి ప్రభావం చూపగలదని కేజ్రీవాల్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు. పంజాబ్ లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రీపోల్ సర్వేలు చెప్పాయి.

అలాగే ఉత్తరాఖండ్, గోవాలో కనీసం ప్రధాన ప్రతిపక్షంగా అన్నా నిలవటం ఖాయమనే అనుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే ఎన్నికల కమిషన్ పరీక్షలో ఆప్ విజయం సాధించినట్లే. పంజాబ్ లో అధికారంలోకి వచ్చి, రెండు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడటం కన్నా కేజ్రీవాల్ కు కావాల్సిందేముంటుంది ?

ఇక్కడ విషయం ఏమిటంటే మూడు వేర్వేరు రాష్ట్రాల లోక్ సభ ఎన్నికల్లో 2 శాతం ఓట్లు తెచ్చుకోవాలి లేదా 11 లోక సభ సీట్లు గెలవాలి. లేదా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు లేదా ఏదైనా రాష్ట్రం నుండి 4 లోక్ సభ సీట్లలో గెలవాలి. ఇక మూడో షరతు ఏమిటంటే నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపార్టీగా గుర్తిపుండాలి. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధిస్తే ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లో ఆప్ కు ఇప్పటికే రాష్ట్ర పార్టీగా గుర్తింపుంది.

ఈ కారణంతోనే కేజ్రీవాల్ ఇంతగా కష్టపడుతున్నారు. కేజ్రీవాల్ కష్టం చూస్తే ఫలిస్తుందనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ ప్రచారం చేసినా ఢిల్లీ మోడల్ నే కేజ్రీవాల్ ఉదాహరణగా చూపుతున్నారు.

జనాలు కూడా దీంతో కన్వీన్సవుతున్నారు. లాజికల్ గా అయితే కేజ్రీవాల్ ఈ పరీక్షను పాసయ్యేందుకే అవకాశముంది. మరి క్షేత్రస్థాయిలో ఓటర్లు ఏమాలోచిస్తున్నారో చూడాల్సుంది.  మరి కేజ్రీవాల్ కు ఆల్ ది బెస్ట్ చెబుదామా ?
Tags:    

Similar News