ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. ఓ స్మగ్లర్ లేడితో ఆయన దిగిన ఫొటో ఇప్పుడు దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫొటోపై కేజ్రీవాల్ ఇంతవరకూ స్పందించలేదు. మానవ అక్రమ రవాణా రాకెట్ నిందితురాలు ప్రభామున్నీతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దిగిన ఫొటో ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలోని పంజాబి బేక్ ప్రాంతంలో ప్రభామున్నీని పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే కేజ్రీవాల్ ఫొటో బయటకు రావడం సంచలనంగా మారింది.
ప్రభామున్నీ ఎంతో మంది యువతులకు మాయమాటలు చెప్పి మోసం చేసి అమ్మేసింది. జార్ఖండ్ లో ఆమెపై పలు కేసులున్నాయి. 2013 నుంచి పరారీలో ఉన్న ప్రభామున్నీ ఎన్జీవో పేరిట ఉద్యోగాల కల్పిస్తామని ఓ ఏజెన్సీని స్థాపించి జార్ఖండ్ రాష్ట్రంలోని అమాయకపు యువతులను ప్రలోభ పెట్టి .. ఉద్యోగాలను ఎరవేసి వారిని ఢిల్లీకి పిలిపించి మానవ అక్రమ రవాణా రాకెట్ లో భాగంగా విక్రయించేది. దీనిపై జార్ఖండ్ లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. దీంతో వలపన్ని ఢిల్లీలో జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల రిమాండ్ లో ఉందని.. ఆమెను ప్రశిస్తే మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది.
అయితే ఇంతటి కిలాడీ లేడి తో సన్నిహితంగా ఫొటో దిగిన కేజ్రీవాల్ కు ఆమె ఎలా తెలుసు.. ఏంటి సంబంధమనే ప్రశ్న ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతోంది.