దేశంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ... ఆ పార్టీ పట్టిందల్లా బంగారంగా మారి పాదం మోపడానికి కూడా వీలు లేని రాష్ట్రాల్లోనూ పవళించడానికి కావాల్సినంత చోటు దక్కించుకుంటున్న పరిస్థితులును చూసి కూడా ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పెద్దపెద్ద ఆశలు పెట్టుకుంటున్నారు. ఢిల్లీలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ఆయన చాలా గట్టిగా చెబుతున్నారు. కీలక నేతలు ఆప్‌ను వదిలి బీజేపీలో చేరిపోయినా.... పార్టీలో క్రమశిక్షణలోపించి తలో రకంగా వ్యవహరిస్తున్నా ఆయనలో ఇంత నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావడం లేదు. తుపాకీ రాముడిలా ఆయన ఆడుతున్న మాటలు నిజమవుతాయో లేదో కానీ బీజేపీతో అమీతుమీ తేల్చుకోవడానికే ఆయన పూర్తిగా సిద్ధపడుతున్నారు.
కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి నామినేషన్ కూడా వేసేశారు. అంతకుముందు ఆయన నిర్వహించిన రోడ్ షోలో బీజేపీపై విరుచుకు పడ్డారు. మళ్లీ అధికారం తమదేనని.. ఈసారి రాజీనామా చేయనని చెప్పారు. అయితే, కేజ్రీవాల్ రోడ్‌షోకు మాత్రం ఒకప్పటి ఆదరణ కనిపించకపోవడంతో ఢిల్లీలో ఏం జరగబోతోందన్నది చాలామంది అంచనా వేస్తున్నారు. గట్టి పోటీ ఇచ్చినా మళ్లీ ఆయన అధికారం అందుకుంటారన్నది అనుమానమే అన్ని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.