చైనా 'జలాయుధం'.. బోర్డర్ లో భారీ ప్రాజెక్టు.. భారత్ పై 'బాంబ్'
చైనా మీదుగా భారత్ లోకి ప్రవహించే నది బ్రహ్మపుత్ర. దీనిపై చైనా ప్రపంచంలోనే భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైంది.
భవిష్యత్ లో యుద్ధాలు ఆయుధాలతో కాదు.. నీటితో జరుగుతాయి అనేది అంచనా. ఇది నిజామే అనిపిస్తోంది.. ప్రత్యక్షంగా భూమ్మీదకు దిగి యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా.. నీటితోనే శత్రువును ఓడించే ఎత్తుగడలు పాటించే అవకాశం ఉంది. ఎవరో ఏమో కానీ.. ఇలాంటి కుయుక్తులు పన్నాలంటే మన పొరుగునున్న చైనా ముందుంటుంది.
జీవాయుధం కాదు.. జలాయుధం చైనా గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది.. జీవాయుధాలు తయారు చేస్తుందనేది దానికి ఉన్న పేరు. కానీ, జలాయుధం కూడా తయారు చేస్తోంది. అయితే, నేరుగా కాదు. ఓ ప్రాజెక్టు రూపంలో. అదేమంటే..?
బ్రహ్మపుత్రపై ప్రాజెక్టుతో..
చైనా మీదుగా భారత్ లోకి ప్రవహించే నది బ్రహ్మపుత్ర. దీనిపై చైనా ప్రపంచంలోనే భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైంది. వాస్తవానికి ఇది భారత్ కు నష్టం. కానీ, పొరుగు దేశం అభ్యంతరాలను కాదని మరీ చైనా చేపడుతోంది. కాగా, ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం టిబెట్ తూర్పు అంచులో యార్లంగ్ జంగ్బో నది దిగువన ఉంది. దీని ఉత్పత్తి సామర్థ్యం 300బిలియన్ కిలోవాట్ అవర్స్. సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీంతో రక్షణ పరంగానూ భారత్ కు సమస్యలు రానున్నాయి. యుద్ధం వస్తే ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా ‘వాటర్ బాంబ్’గా ప్రయోగించే ప్రమాదం ఉంది.
ఆ భారీ ప్రాజెక్టు కంటే..
చైనా నిర్మించిన అద్భుత ప్రాజెక్టుల్లో ఒకటిగా చెప్పే త్రీ గోర్జెస్ డ్యాం సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్. కొత్తగా టిబెబ్ లో కట్టే జలాశయం దీనికంటే దాదాపు మూడు రెట్లు పెద్దది.
మన ఈశాన్యానికి వరదాయిని..
బ్రహ్మపుత్రం నది టిబెట్ లో పుడుతుంది. వాస్తవానికి టిబెట్ ఒకప్పుడు స్వతంత్ర దేశం. దానిని ఆక్రమించింది చైనా. ఇక్కడ పుట్టే బ్రహ్మపుత్ర నది (టిబెట్ లో యార్లంగ్ జంగ్బో అంటారు) భారత్ మీదుగా బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తోంది. మన ఈశాన్య రాష్ట్రాలకు వరదాయిని కాగా.. బంగ్లాలో భారీ వరదలకు కారణమవుతుంది. బ్రహ్మపుత్ర నదీ జలాలపై భారత్-చైనా మధ్య ఒప్పందం ఉంది. మే 15-అక్టోబరు 15 వరకు వరద ప్రమాదం ఉంటే నదీ మట్టాలను దిగువ దేశాలకు తెలియజేయాలి.
నాలుగేళ్ల కిందట డోక్లాం వద్ద ఉద్రిక్తతలు పెరిగికా చైనా భారత్ తో బ్రహ్మపుత్రం సమాచారం పంచుకోవడం లేదు. ఒప్పందం 2023తో ఒప్పందం ముగిశాక కొత్త ఒప్పందం చేసుకోలేదు.
బ్రహ్మపుత్రంపై చైనా ప్రాజెక్టును పూర్తి చేస్తే వేసవిలో ఆ నది నీటిని మళ్లిస్తుంది. అదే జరిగితే అసోం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు ఎద్దడి ఎదుర్కొంటారు. వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నుంచి భారీగా నీటిని విడుదల చేస్తే.. దిగువ ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.