పార్టీ నిర్ణయం మేరకు తాము పోటీచేసే 8 స్థానాల్లో కాకుండా, మిగిలిన స్థానాల్లో కేసీఆర్ ను గెలిపించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇంకో తెలుగు రాష్ట్రంలో కూర్చొని, ఇంకో రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాలను కంట్రోల్ చేయాలనుకోవడం అవివేకం అన్నారు. సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో అసద్ పాల్గొన్నారు.
ఎంఐఎం 8 సీట్లు గెలుస్తుందని, మహాకూటమి, బిజెపికి ఓటమి తప్పదని అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. కేసీఆర్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమని ఆయన అన్నారు. తాము ఓట్లను చీల్చ దలుచుకోలేదని అందుకే 8 సీట్లలో పోటీ చేస్తున్నామని అసద్ స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ మర్యాద, చరిత్ర తెలుసుకోవాలని అసద్ హితవు పలికారు. కాంగ్రెస్ కు మద్దతు తెలిపినప్పుడు తనపై దాడులు జరిగిన విషయాన్ని, న్యూక్లియర్ ఒప్పందంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన సంగతిని ఆయన గర్తుచేశారు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ప్రభుత్వం అవసరం ఉందని, ఎన్నో ఏళ్లు కాంగ్రెస్, టిడిపి పాలించి ఏం చేశాయని ప్రశ్నించారు. ట్రిపుల్ తలక్ అంశంలో మోడీకి -రాహుల్ ఎందుకు మద్దతు తెలిపారని అసద్ నిలదీశారు.
సర్వేలను విశ్లేచించడానికి తాను నిపుణుడిని కాదని అసదుద్దీన్ అన్నారు. పేర్లు వినని కంపెనీలు సర్వేలతో హల్ చల్ చేస్తున్నాయని, ఈ సర్వేలపై ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించాలని ఆయన కోరారు. బీజేపీ నేతలు వాడిన భాషపై అసద్ అభ్యంతర తెలిపారు. ఉన్న సమస్యలపై దృష్టి పెట్టకుండా వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు నమ్మినసిద్ధాంతం కోసం చావడానికైనా సిద్ధమన అసదుద్దీన్ అన్నారు.