పాయింటే కదా అసదుద్దీన్ జీ!

Update: 2015-04-13 03:59 GMT
ముస్లింలకు ఏమి జరిగినా మేమున్నాం... మే ముంటాం... అని చెప్పుకునే అసదుద్దీన్ ఒవైసీ అండ్ కో లు కేవలం ఉగ్రవాద ముస్లింల తరుపున మాట్లాడతారే కానీ... వారికి వ్యతిరేకంగా పనిచేసిన పోలీసుల తరుపున ఎందుకు మాట్లాడరని సూటిగా నిలదీశారు బీజేపీ నేత! ముస్లింలకు సంబందించిన ఏ విషయం అయినా ముందుండే అసదుద్దీన్... కేవలం ఉగ్రవాదుల విషయంలో మాత్రమే సీరియస్ అవ్వడం వెనక అసలు ఉద్దేశ్యం ఏమిటో అని ప్రశ్నిస్తున్నారు! తాజాగా... జనగామలో జరిగిన ఎన్ కౌంటర్ లో వికారుద్దీన్, అతడి అనుచరులు మృతిచెందితే... ముస్లిం మతపెద్దలతో కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు అసదుద్దీన్! అదే సమయంలో ఉగ్రవాదులకు - పోలీసులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో కూడా సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వాళ్లు ముస్లింలా, హిందువులా, క్రైస్తవులా అనే తేడా ఉగ్రవాదానికీ - పోలీసు వ్యవస్థకు మధ్య ఉండదని మజ్లిస్ అధినేతకు తెలియదు అనుకోలేం!
సరే కాసేపు ఆ విషయం పక్కన పెడితే... ఉగ్రవాదులతో పోరాడి తూటాలకు బలైన ముస్లిం ఎస్ఐ మహ్మద్ సిద్దిఖ్ అలియాస్ సిద్ధయ్యను చనిపోతే కనీసం ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు అసదుద్దీన్ వెళ్లలేదు. ఈ పాయింటే మాట్లాడుతున్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ బి.పండరి. ఉగ్రవాదుల విషయంలో కనబరిచిన శ్రద్ధ, మానవత్యం... అమరుడైన ఒక పోలీస్ విషయంలో ఎందుకు అనుసరించడం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజులు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడిన సిద్ధయ్యను... ముస్లింలకు తామే ప్రతినిధులమని ప్రగల్బాలు పలికే అసదుద్దీన్ గానీ, మజ్లిస్ ఎమ్మెల్యేలుగాని, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీగాని పరామర్శించలేదని, చనిపోయిన సిద్దయ్య కుటుంబ సబ్యులను కనీసం ఓదార్చడానికి కూడా వెల్ల లేదని, ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని పండరి డిమాండ్ చేశారు
Tags:    

Similar News