తెలంగాణ బీజేపీనాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై ముస్లిం వర్గంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యాలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక ఉపఎన్నిక కోసం బీజేపీ తెలంగాణలో ఎందుకు అగ్గిరాజేస్తోందని మండిపడ్డారు. రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండించిన అసదుద్దీన్, హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలను ఖండిస్తారా? లేదా? అని ప్రధాని, బీజేపీని ప్రశ్నిస్తున్నామన్నారు. ఇది మీకు ఒక అధికార విధానంగా మారిందా అని నిలదీశారు. నుపూర్ శర్మ నుంచి మొదలు మీ ఎమ్మెల్యేల వరకు ఎందుకు ఇలా సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌పై ఎందుకు కన్నేశారని ప్రశ్నించారు.
తెలంగాణను ఎందుకు అంతం చేయాలనుకుంటున్నారని అన్నారు. కేసీఆర్‌తోనో, ఎంఐఎంతోనో పోరాడాలనుకుంటే పోరాటం చేయండని, తామ సిద్ధమేనని ఓవైసీ వ్యాఖ్యానించారు. రాజకీయ పరంగా వెనుకడుగు వేసేదే లేదన్నారు.
కానీ అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తూ ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతున్నారని, దీనిని ఎట్టి పరిస్తితిలోనూ సహించేది లేదని ఓవైసీ హెచ్చరించారు. ఒక్క మునుగోడు ఉపఎన్నిక కోసం తెలంగాణలో అగ్గిరాజేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రతిష్ఠను దెబ్బతీయాలనుకుంటున్నారని అన్నారు.
8 ఏళ్లలో చిన్నచిన్న ఘటనలు మినహా ఎలాంటి ఘటనలు చోటుచేసుకో లేదన్న ఓవైసీ.. బీజేపీ దృష్టి పడ్డాకే.. హైదరాబాద్‌లో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని తాజా ఘటనతో నిరూపితమైందన్నారు. తెలంగాణను, హైదరాబాద్‌ను ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దేశానికి, ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీశారు.