తినే తిండికి ఎన్నికల్లో ఓటేయటానికి సంబంధం ఏమిటన్న ఆలోచన అస్సలు చేయొద్దు. భావోద్వేగాల్ని ఓట్లగా మార్చుకునే ఎత్తగడలో సంచలన వ్యాఖ్యలు చేశారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. గెలుపు కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. భావోద్వేగాల్ని రెచ్చగొట్టేలా ఆయన తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ‘‘ఎంఐఎం అధికారంలోకి రాకుంటే మీకు బీఫ్ ఉండదు. నేనేమీ భయపెట్టటం లేదు. ఎన్నికల్లో మజ్లిస్ ను ఓడిస్తే మైనార్టీలు బీఫ్ తినటాన్ని మర్చిపోవాల్సిందే. బీఫ్ కావాలంటే గ్రేటర్ లో మజ్లిస్ ను గెలిపించండి. బీజేపీ.. టీడీపీ లు గెలిస్తే గో మాంసం పేరిట బీఫ్ ను నిషేధించే ప్రమాదం ఉంది’’ అంటూ అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేస్తున్నారు.
ఎప్పటిలానే బీఫ్ తినాలంటే మజ్లిస్ కు మేయర్ పీఠం దక్కాలని.. లేకుండా బీఫ్ ను మర్చిపోవాల్సి ఉంటుందని హెచ్చరించటం గమనార్హం. ముంబయిలో బీజేపీ సర్కారు గోవధ నిషేధం పేరుతో బీఫ్ అమ్మకాల్ని నిలిపేసిందని.. దీంతో అక్కడ బీఫ్ దొరక్క వారం పాటు దళితులు.. ముస్లింలు ఆందోళనలు చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. బీఫ్ కి.. ఓటుకు లింకెట్టి అసద్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపుతాయో..?