ఎంఐఎం : ఆ ...స‌వాల్ ను రాహుల్ స్వీక‌రిస్తాడా ?

Update: 2022-05-08 15:31 GMT
తెలంగాణ వాకిట మాట‌లు కోట‌లు దాటుతున్నాయి. రోజుకో వివాదం రోజు కో రీతిన వెలుగులీనుతోంది. మ‌ధ్య మ‌ధ్యలో చీక‌టి కోణాల‌ను సైతం వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆ విధంగా తెలంగాణ వాకిట చాలా విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఉమ్మ‌డి ఆంధ్రా వివాదాలు మొదలుకొని రేవంత్ రెడ్డి వ‌ర‌కూ ఎన్నో వాదాలు, ప్ర‌తివాదాలు, వాదోప‌వాదాలు, చ‌ర్చోప‌చ‌ర్చలు డిజిట‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

ఇదే స‌మ‌యంలో తెలంగాణ ఉద్య‌మ కాలం, ఆ రోజు నాయకులు చేసిన ప్ర‌తిజ్ఞలు, ఇచ్చిన హామీలు ఇవి కూడా గుర్తుకు వస్తున్నాయి. దీంతో తెలంగాణ స‌మాజంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజురోజుకూ వేడెక్కుతోంది. అందుకే.. నాయ‌కులు ఎవ‌రికి వారు సెల్ఫ్ డిఫెన్స్ లో ఉంటూ మాట్లాడ‌డం నేర్చుకుంటున్నారు. మ‌రీ ! నేల విడిచి విమ‌ర్శ‌లు చేసినా కూడా ఫ‌లితాలు రావు అన్న సంగ‌తి వారికి కూడా తెలుసు. త‌మ సైద్ధాంతిక‌తకు ద‌గ్గ‌ర‌గా ఉండే మాట‌లు ఎంచుకుని కొంద‌రు మాట్లాడ‌డం కూడా బాగుంది. ఆ విధంగా మ‌రోసారి కేసీఆర్-కు తాను దోస్తున‌ని చెప్ప‌క‌నే చెప్పారు పెద్ద ఓవైసీ అస‌దుద్దీన్.

తెలంగాణ వాకిట వ‌రంగ‌ల్ లో జ‌రిగిన సభ సంద‌ర్భంగా  యువ రాజు రాహుల్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అవే ఇప్పుడు సంచ‌ల‌నం అవుతున్నాయి. రాజకీయంగా వీటిని స్వీక‌రించి త‌ద‌నుగుణంగా మాట్లాడేందుకు బాగానే నేత‌లు ఇష్ట‌ప‌డుతున్నారు.

అందుకే రాహుల్ నీకు ద‌మ్ముంటే మా హైద్రాబాద్ లో కానీ మా మెద‌క్ లో కానీ పోటీ చేయు అని స‌వాల్ విసురుతున్నారు ఎంఐఎం బాస్. మ‌రి! ఇదే కాంగ్రెస్-తో కొన్నాళ్ల పాటు ఎంఐఎం స్నేహం చేసింది క‌దా! ఆ నాటి స్నేహం ఏమ‌యిపోయింది. అంటే అవ‌న్నీ అవస‌రార్థ స్నేహాలే అని గుర్తించి ప‌క్క‌కు త‌ప్పుకోవాలా ? లేదా ఇప్ప‌టి అవ‌స‌రం కాదు కాదు రాజ‌కీయ అవ‌స‌రం రీత్యా ఎంఐఎం నేత ఆ విధంగా మాట్లాడి ఉంటార‌ని గుర్తించాలా ? ఏమ‌యినా క్ష‌ణానికో మారు మారిపోయే రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ల్లో క్రియాశీలక మార్పులు  అన్న‌వి అభివృద్ధి ప‌రంగా జ‌ర‌గ‌వు కానీ నాయ‌కుల నైజం ప‌రంగా మాత్రం జ‌రిగి తీరుతాయి. ఆ విధంగా  ఎవ‌రు ఎవ‌రినైనా అస్స‌లు ఆత్మ ప‌రిశీల‌న అన్న‌ది లేకుండా మాట్లాడేయ‌వొచ్చు.
Tags:    

Similar News